ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. దీంతో తాజాగా ఐపీఎల్ 2020  ప్లేఆఫ్స్‌ షెడ్యూల్, వేదికల్ని ఖరారు చేశారు. తొలుత ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించినప్పుడు కేవలం నవంబర్‌ 3 వరకు లీగ్ దశ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదిక (IPL 2020 Final Venue)ల వివరాలు వెల్లడించారు. సీజన్‌లో ముఖ్యమైన ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి (BCCI) తాజాగా ప్రకటించింది. నవంబర్ 10 (IPL 2020 Final Date)న దుబాయ్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ 3న చివరి లీగ్‌లో చివరి మ్యాచ్ నిర్వహిస్తారు. నవంబర్‌ 4వ తేదీన రెస్ట్. ఏ మ్యాచ్‌లు ఉండవు. ఇక నవంబర్‌5 తేదీన దుబాయ్‌ వేదికగా తొలి క్వాలిఫయర్‌ (Qualifier 1) మ్యాచ్‌ జరుగనుంది. ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 జరుగనుంది. 



అబుదాబిలో ఎలిమినేటర్ మ్యాచ్, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. నవంబర్‌ 6న ఎలిమినేటర్‌ మ్యాచ్‌. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరగనుంది. నవంబర్‌ 8న క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ అబుదాబి వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తలపడతాయి. 



దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌ 2020 తుది పోరు జరగనుంది. క్వాలిఫయర్‌-1, క్వాలిఫయర్‌-2 విజేతల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా, మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీ నవంబర్ 4 నుంచి 9 వరకు జరగనుంది. మహిళల టీ20కి షార్జా వేదిక కావడంతో ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఇక్కడ నిర్వహించడం లేదు. మహిళల టీ20 లీగ్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవల విడుదల చేసింది.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe