SRH vs RR Match IPL 2020: రాజస్థాన్‌కు సన్‌రైజర్స్ రిటర్న్ గిఫ్ట్.. అదుర్స్

SRH Return gift to RR IPL 2020 | హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చేది రుచికరమైన బిర్యానీ. మ్యాచ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేసిన బిర్యానీ కామెంట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) అదిరిపోయే బదులిచ్చింది. సన్‌రైజర్స్ రిటర్న్ గిఫ్ట్ అదిరిందిగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

Last Updated : Oct 23, 2020, 01:04 PM IST
SRH vs RR Match IPL 2020: రాజస్థాన్‌కు సన్‌రైజర్స్ రిటర్న్ గిఫ్ట్.. అదుర్స్

హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చేది రుచికరమైన బిర్యానీ. అన్ని మసాలాదినుసులతో కలిపి స్పైసీగా ఉండే బిర్యానీ అంటే విదేశీయులు సైతం లొట్టలేసుకుంటూ హైదరాబాద్ బిర్యానీని తింటారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా మ్యాచ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేసిన బిర్యానీ కామెంట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) అదిరిపోయే బదులిచ్చింది. సన్‌రైజర్స్ రిటర్న్ గిఫ్ట్ అదిరిందిగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

 

అక్టోబర్ 11న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం హైదరాబాద్ జట్టుపై విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ‘హేయ్‌ జొమాటో! మేం ఓ పెద్ద హైదరాబాద్‌ బిర్యానీ ఆర్డర్‌ చేయాలనుకుంటున్నాము. లొకేషన్‌ : రాయల్‌ మిరాజ్‌’ అంటూ రాజస్థాన్ రాయల్స్  వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.’ #WorldBiryaniDay అని హ్యాష్ ట్యాగ్ జత చేసింది. 

 

 

అవకాశం కోసం ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్ గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయం సాధించింది. రాజస్థాన్ బిర్యానీ కామెంట్‌ను సన్‌రైజర్స్ తమదైనశైలిలో తిప్పికొట్టింది. అక్టోబర్ 22న రాత్రి మ్యాచ్ ముగిసిన వెంటనే.. రాజస్థాన్ ట్వీట్‌పై ఇలా రీట్వీట్ చేసింది. ‘ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. మిత్రులు బిర్యానీ కారాన్ని తట్టుకోలేరు. మీకు దాల్ బాటి సరిపోతుంది’ అంటూ వ్యంగ్య ట్వీట్‌ను సన్‌రైజర్స్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News