మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ( Royal Challengers Bengalore ), సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunriser Hyderabad ) మధ్య ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) మూడో మ్యాచు ప్రారంభం కానుంది. హైదరాబాద్ టీమ్ ను డేవిడ్ వార్నర్ సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఆర్సీబిని విరాట్ కోహ్లీ ముందుకు నడిపించనున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో రెండు మ్యాచులు జరిగాయి. ఈ రెండు మ్యాచులు కూడా చాలా ఎగ్జైటింగ్ గా సాగాయి. దీంతో ఈ  మ్యాచుపై క్రికెట్ అభిమానుల అంచనాలు మరింతగా పెరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి


టీమ్ ఇండియాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న విరాట్ కోహ్లీ ఆర్సీబికి ఒక్క టైటిల్ కూడా ఇప్పటి వరకు సాధించలేదు. ఇలాంటి పరిస్థితిలో విరాట్ దళం ఈ సారి అయినా కప్పు సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. గత మూడు సీజన్స్ లో ఆర్సీబి ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్ లోకి వెళ్లలేదు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ టీమ్ ను ఓడించి తమ టీమ్ తో పాటు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడానికి విరాట్ కోహ్లీ ప్రయత్నిస్తాడు.  


మరోవైపు హైదరాబాద్ మాత్రం తమ జెంటల్మెన్ గేమ్ తో అందరిమనసులు ఎలా గెలుస్తుందో.. అదే విధంగా ఈ సారి టైటిల్ గెలవడానికి ప్రయత్నిస్తుంది. దానికి ఈ మ్యాచుతోనే శుభారంభం చేయాలి అని అది ప్రయత్నిస్తోంది.  ఒక విధంగా చెప్పాలి అంటే రెండూ టీమ్స్ మంచి స్టార్ట్ కోసం ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి అని ప్రయత్నిస్తాయి. 



ALSO READ|Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?


ఐపీఎల్ లో ఈ రెండు టీమ్స్ 15 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబి ఆరుమ్యాచులు నెగ్గింది. హైదరాబాద్ టీమ్ 8 మ్యాచులు గెలిచింది. అదే సమయంలో ఒక మ్యాచు మాత్రం డ్రా అయింది.


ఇరు జట్లలో విధ్వంసకరమైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. బెంగుళూరులో విరాట్ కోహ్లీ ( Virat Kohli ), ఏబి డి విలియర్స్ తో ( AB de Villiers ) పాటు ఆరాన్ ఫించ్ ఉన్నారు. మరో వైపు హైదరాబాద్ టీమ్ లో డేవిడ్ వార్నర్ ( David Warner ), ఫాబియన్ ఆలెన్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే ఉన్నారు. అంటే ఈ రెండు టీమ్స్  నుంచి భారీ హిట్స్ ను... అద్భుతమైన ఆటను ప్రేక్షకులు ఆశించవచ్చు.


బౌలింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ టీమ్ లో భువనేశ్వర్ కుమార్ ప్లస్ పాయింట్.  సందీప్ శర్మ, సిద్ధార్థ్, థంపీ లు బౌలింగ్ లో సన్ రైజర్స్ కు బలం అందించనున్నారు.  వీరితో పాటు మొహమ్మద్ నవీ, రాషీద్ ఖాన్ వంటి ఆల్ రౌండర్స్ కూడా హైదరాబాద్ టీమ్ విజయ అవకాశాలన్ని పెంచనున్నారు. 


రాయల్ ఛాలెంజర్స్ బౌలింగ్ విషయానికి వస్తే చహాల్, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, ఆడం జంపా, మొయిన్ అలీ మంచి బౌలింగ్ ట్రాక్ ఉన్నవాళ్లే. దాంతో పాటు ఫాస్ట్ బౌలర్లు అయిన మొహమ్మద్ సిరాజ్,  ఉమేష్ యాదవ్, డెయిల్ స్టెయిన్ ఆర్సీబికి బౌలింగ్ లో బలాలుగా ఉన్నవాళ్లే.



ALSO READ| Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయంలో జాగ్రత్త



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే     ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR