టోక్యో వేదికగా జరుగుతన్న పారాలింపిక్స్​లో (Tokyo Paralympics 2021) భారత్​కు తొలి పతకాన్ని ఖాయం చేసింది అథ్లెట్ భారత టీటీ ప్లేయర్​ భవీనాబెన్ పటేల్ (TT Player Bhavinaben Patel). మహిళల సింగిల్స్​ క్లాస్​ 4 టేబుల్​ టెన్నిస్​లో (Table Tennis) సంచలన ప్రదర్శనతో ఆమె ఫైనల్ లోకి దూసుకెళ్లింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్ 2, రియో పారా ఒలింపిక్స్‌ (Riyo Paralympics 2016) స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు (Serbia) చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులో ఘన విజయం సాధించి సెమీస్‌కి దూసుకెళ్లింది. సెమీస్​లో చైనా (China) ప్లేర్​ మియావో జాంగ్​పై 3- 2 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ నుంచి ఫైనల్ కు చేరిన తొలి ప్యాడ్లర్‌గా చరిత్ర సృష్టించింది.


Also Read: Bank Holidays: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సగం రోజులు సెలవులే


పతకం ఖాయం
శనివారం జరిగిన సెమీస్​ మ్యాచ్​ను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో గెలుపొందింది భవీనా. ఆదివారం జరగనున్న ఫైనల్​ పోరులో వరల్డ్​ నంబర్​ వన్​ సీడ్​, చైనా ప్లేయర్​ యింగ్​ ఝోతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో భవినాబెన్ ఒక‌ వేళ‌ ఓడినా భార‌త్‌కు సిల్వ‌ర్ మెడ‌ల్ ద‌క్క‌నుంది. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics 2021) పతకాన్ని ఖాయం చేసుకున్న మొట్ట మొదటి భారత క్రీడాకారిణిగా భవినాబెన్‌ పటేల్‌ (Bhavinaben Patel) నిలిచింది. అంతేకాదు పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది.


సరాదాగా ఆడిన ఆటే..
అయితే ఆమె మెరుగైన ఈ ప్రదర్శన వెనక ఆమె పడిన కష్టం కూడా చాలా ఉంది. అదేంటంటే.. గుజరాత్‌లోని (Gujarat) మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భవీనాబెన్ చిన్నతనంలోనే పోలియో (Polio) కారణంగా తన నడుము కిందిభాగం అచేతనంగా మారింది. అలా బాల్యంలోనే చక్రాల కుర్చీకి పరిమితమైన ఆత్మవిశ్వాసంతో ఫిట్‌నెస్‌ (Fitness) కోసం టీటీ (TT) ఆడడం మొదలెట్టి ఆటపై ప్రేమ పెంచుకుని. మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.  


Also Read: Ichata Vahanumulu Niluparadu Review: "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమా రివ్యూ


ఐదేళ్ల కిందటే 2016 రియో పారాలింపిక్స్‌కు (Riyo Paralympics 2016) భవీనా ఎంపికైనా సాంకేతిక కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయినా ఎన్నో సవాళ్లను దాటి జీవితంలో విజేతగా నిలిచిన ఆమె. అంతర్జాతీయ వేదికల పై నిలకడగా రాణిస్తూ ఓ దశలో ప్రపంచ రెండో ర్యాంకునూ చేరుకుంది. ర్యాంకింగ్స్‌లో తనకంటే మెరుగైన ప్రత్యర్థులను ఓడించి సెమీస్‌ చేరి పతకం ఖాయం చేసిన ఆమె.. మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగించి పసిడిని అందుకోవాలని పట్టుదలతో ఉంది. పోలియోను దాటి పారాలింపిక్స్​ పతకాన్ని చేరుకున్న భవీనాబెన్​ ప్రయాణం స్ఫూర్తిదాయకం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook