Ichata Vahanumulu Niluparadu Review: "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమా రివ్యూ

సుశాంత్‌, మీనాక్షి చౌద‌రి మెయిన్ రోల్ లో వచ్చిన సినిమా "ఇచ్చట వాహనములు నిలుపరాదు". టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయిన అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు.. ఈ సినిమాతో అయిన సుశాంత్ హిట్ కొడతాడా ?? లేదా అన్నది చూడాలి....

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2021, 11:48 AM IST
  • నేడే విడుదలైన "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమా
  • అలరించిన ప్రవీణ్ ల‌క్కరాజు సంగీతం
  • ఆకట్టుకున్న వెన్నెల కిశోర్‌ కామెడీ
Ichata Vahanumulu Niluparadu Review: "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమా రివ్యూ

న‌టీన‌టులు:      సుశాంత్‌, మీనాక్షి చౌద‌రి, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు
దర్శకత్వం:      ఎస్‌. దర్శన్‌
సంగీతం:           ప్రవీణ్ ల‌క్కరాజు
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్‌
ఎడిటింగ్‌:          గ్యారీ బి.హెచ్‌
సంగీతం:           ప్రవీణ్‌ లక్కరాజు
నిర్మాత:             శంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్‌
విడుద‌ల:           27-08-2021

అక్కినేని యంగ్‌ హీరో సుశాంత్ (Sushanth) టాలీవుడ్‌లోకి (Tollywood) ఎంట్రీ ఇచ్చి చాలాకాలమే అయినా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి సినిమా కాళిదాసుతో (Kalidhasu) పాటు కరెంట్ (Current), అడ్డా లాంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించినా, సుశాంత్‌కు మాత్రం స్టార్‌డమ్‌ని తీసుకురాలేకపోయాయి. దీంతో కొన్నిరోజులు సినిమాలను పక్కన పెట్టిన ఈ అక్కినేని హీరో... "చిలసౌ"(Chi La Sow) తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుశాంత్‌ మళ్లీ గాడిలో పడ్డట్టే అనిపించింది. "అలవైకుంఠపురములో" (Ala Vaikunthapurramuloo) లో ముఖ్యమైన పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు మెయిన్ లీడ్ గా "ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు" (Ichata Vahanumulu Niluparadu)తో ముందుకొచ్చాడు.

Also Read: Heavy Rains: రానున్న 48 గంటలు..ఆ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు

క‌థ...

హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన అరుణ్ (సుశాంత్) డిజైన్ స్టూడియో అనే కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా ప‌ని చేస్తుంటాడు. అదే కంపెనీలో ఇంట‌ర్న్ కోసం జాయిన్ అవుతుంది మీనాక్షి (మీనాక్షి చౌద‌రి) (Meenakshi Choudhary). ఇద్దరూ తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతారు. ఆమె కోసం డ్రైవింగ్‌ నేర్చుకొని మరీ కొత్త బైక్‌ని కొంటాడు. ఒక రోజు మీనాక్షి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకొని, కొత్త బైక్‌ వేసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు అరుణ్‌. అదే సమయంలో ఆ ఏరియాలో ఓ సీరియల్‌ నటిపై మర్డర్‌ అటెంప్ట్‌ జరుగుతుంది. ఇది అరుణే చేశాడని భావించి ఆ ఏరియా జనాలంతా అరుణ్‌ కోసం వెతకడం ప్రారంభిస్తారు. వారిని నుంచి అరుణ్‌ ఎలా తప్పించుకున్నాడు? అరుణ్‌ని కాపాడడం కోసం మీనాక్షి ఏం చేసింది? అసలు సీరియల్‌ నటిపై హత్యాయత్నం చేసిందెవరు? పులి (ప్రియదర్శి)కి అరుణ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇందులోకి నర్సింహ యాదవ్‌ (వెంకట్‌) ఎలా ఎంటర్‌ అయ్యాడు? ‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు’అనే టైటిల్‌కి ఈ కథకి మధ్య ఉన్న లింకేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..?

యాక్షన్‌ థ్రిల్లర్‌ (Action Thriller ), కామెడీ(Comedy ), రొమాన్స్‌ (Romance) ప్రధాన అంశాలుగా అరుణ్‌ పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించాడు సుశాంత్‌. డ్యాన్స్‌.. యాక్షన్ ప‌రంగా చాలా కొత్తగా క‌నిపించాడు. గత తన సినిమాల్లో కంటే ఇందులో సుశాంత్‌ కొత్త లుక్‌తో కనిపించాడు. ఇక మీనాక్షి పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఓ ఏరియా కార్పొరేటర్‌గా వెంకట్‌ ఫర్వాలేదనించాడు. ఆరంభంలో వెంక‌ట్ పాత్రను బ‌లంగా చూపించినా.. త‌ర్వాత ఆ పాత్రని పెద్దగా వాడుకోలేదు. హీరో ప్రాణ స్నేహితుడు పులి పాత్రలో ప్రియదర్శి (Comedian Priyadarshi )అద్భుతంగా నటించాడు. బైక్‌ షోరూం ఎంప్లాయ్‌గా వెన్నెల కిశోర్‌ (Comedian Vennela Kishore)తనదైన కామెడీతో నవ్వించాడు. అభినవ్ గోమతంతో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

Also Read: Dalita Bandhu scheme: దళిత బంధు స్కీమ్ రివ్యూ మీటింగ్‌లో CM KCR కీలక వ్యాఖ్యలు

ఎలా ఉంది..?
ఆరంభంలో ల‌వ్ ట్రాక్ నిడివి త‌గ్గించి.. అసలు క‌థ‌పై దృష్టి పెట్టి ఉంటే ప్రథమార్ధం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారేది. కొన్ని స‌న్నివేశాల్లో నాట‌కీయ‌త మ‌రీ ఎక్కువైన‌ట్లు అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో అరుణ్ హ‌త్య కేసు నుంచి బయట పడేసేందుకు చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహ‌పురి కాల‌నీ కుర్రాళ్లతో చేసే పోరాటాలు.. తదితర సన్నివేశాలతో కథనం సాగుతుంది. ఇంటర్వల్ వరకు కథలో పాయింట్ మొదలవ్వదు. సెకండాఫ్‌లో మొదలయింది కదా అనుకుంటే సహనాన్ని పరీక్షించే లెవెల్లో కథనం నడుస్తుంది. క్లైమాక్స్‌లో (Cliamax) హ‌త్య కేసు కార‌కుల్ని హీరో త‌న తెలివితేట‌ల‌తో బ‌య‌ట‌పెట్టే సినిమాటిక్‌గా అనిపించే సన్నివేశాలతో ముగుస్తుంది. ఇక ఈ సినిమా ప్రధాన బలం ఏదైనా ఉందంటే అని ప్రవీణ్ ల‌క్కరాజు సంగీతమనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. సాగదీతగా అనిపించిన సన్నివేశాలపై ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌ మరింత దృష్టి పెట్టాల్సి ఉంది.

ముగింపు...

ఇచ్చట వాహనములు నిలుపరాదు (Ichata Vahanumulu Niluparadu) అనే బోర్డు ఉన్న దగ్గర బైక్‌ పార్కు చేసి మనం ఎంత ఉరుకులు పరుగుల మీద పని పూర్తి చేసుకుని వస్తామో... ఆ వేగం ఇక్కడ పనిచేయదు. ఎంతో ఓర్పుతో చూడాల్సిన సినిమా "ఇచ్చట వాహనములు నిలుపరాదు".

Also Read: America Revenge: ఆఫ్ఘన్‌లోని ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా వైమానిక దాడులు

గమనిక:
రివ్యూ సినిమా చుసిన ఒక వ్యక్తి కోణానికి సంబంచినది... ఒక సగటు సినిమా అభిమాని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News