Kavya Maran: ఐపీఎల్ వేలంలో కావ్య మారన్‌కు భారీ షాక్.. శాపంగా మారిన ఆర్‌టీఎం కార్డు
IPL Mega Auction 2025 Arshdeep Singh Missed From Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగావేలంలో అందరి దృష్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ వైపు ఉంటుంది. వేలం ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది.
Kavya Maran: ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా వేలం జెడ్డాలో ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. గత సీజన్‌లో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తన టీమ్‌ను సరిదిద్దుకునేందుకు వేలాన్ని ఉపయోగించుకుంటుందని అందరూ భావించారు. వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే కావ్య మారన్ వైపే అందరి దృష్టి ఉంటుంది. తాజాగా జరిగిన మెగావేలం తొలిరోజే ఆరంభంలోనే కావ్య మారన్‌కు భారీ షాక్ తగిలింది. వేలంలో భారీ ధరకు దక్కించుకోగా అనూహ్యంగా ఒక కార్డు ద్వారా వేరే జట్టు ఆటగాడిని ఎగురవేసుకునిపోయింది. దీంతో కావ్య మారన్ షాక్‌కు గురైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో తొలి ప్లేయర్‌గా వేలానికి అర్ష్‌దీప్ సింగ్ వచ్చాడు. ప్రస్తుతం బంతులతో చెలరేగి ఆడుతున్న ఈ యువ బౌలర్‌ను దక్కించుకోవడానికి జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. అంతర్జాతీయంగా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్న అర్ష్‌దీప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అన్ని జట్లు భావించాయి. ఊహించినట్లే అతడి కోసం జట్లు ఎగబడ్డాయి. రూ.2 కోట్ల కనీస ధరకు వేలంలోకి రాగా చెన్నై సూపర్ కింగ్స్ వేలం పాటను ఆరంభించింది.
ఇది చదవండి: Ind vs Aus: ఆసీస్‌పై భారీ ఆధిక్యంతో ఇండియా, 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రాహుల్-యశస్వి
పోటీగా ఢిల్లీ క్యాపిటల్ జట్టు వచ్చింది. మధ్యలో గుజరాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చి ధర పెంచేసింది. ఆ తరువాత ఢిల్లీ వేలం నుంచి వైదొలగగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడింది. దీంతో అర్ష్‌దీప్ ధర రూ.పది కోట్లు దాటింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అర్ష్‌దీప్ కోసం పోటీకి దిగాయి. చివరకు కావ్య మారన్ రూ.15.75 కోట్లకు వేలంలో దక్కించుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా ఆర్‌టీఎం కార్డును ఉపయోగించింది.
ఆర్‌టీఎం కార్డు వినియోగంతో ఖంగు తిన్న కావ్య మారన్ వెంటనే అర్ష్‌దీప్ కోసం రూ.18 కోట్లు ఆఫర్ చేసింది. అంతే మొత్తం పంజాబ్ కింగ్స్ ఇస్తామని చెప్పడంతో అర్ష్‌దీప్ చేజారిపోయాడు. చివరకు అర్ష్‌దీప్ తన పాత జట్టు పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాడు. యువ బౌలర్‌ను దక్కించుకుంటే జట్టుకు భారీ బలం ఉంటుందని భావించగా.. పంజాబ్ కింగ్స్ అనూహ్య నిర్ణయంతో కావ్యకు భంగపాటు ఎదురైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.