Csk Ms Dhoni: ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు..ఏమిటది!
Csk Ms Dhoni:టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే ఆటగాడు ఎంఎస్ ధోనీ మరో రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న మిస్టర్ కూల్ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ 15వ సీజన్‌లో హాఫ్ సెంచరీతోపాటు పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు.
Csk Ms Dhoni:టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే ఆటగాడు ఎంఎస్ ధోనీ మరో రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న మిస్టర్ కూల్ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ 15వ సీజన్‌లో హాఫ్ సెంచరీతోపాటు పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. అతడు క్రీజ్‌లోకి వచ్చే సమయానికే చేధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో..బ్యాట్ ఝులిపించలేకపోయాడు.
తాజాగా ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో ధోనీ నాలుగో స్థానానికి చేరాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషి ధావన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతిని ధోనీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీకి 220వది. ఓవరాల్‌గా 224వ సిక్సర్. మొత్తంగా చెన్నై తరపున సురేష్ రైనా పేరిట ఉన్న అత్యధిక సిక్సర్లు(219) రికార్డును ధోనీ అధిగమించాడు.
ధోనీ, రైనా తర్వాత డుప్లెసిస్ 93 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా సిక్సర్ల విషయంలో ధోనీ నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 357 సిక్సర్లతో తొలి స్థానంలో..ఏబీ డివిలియర్స్ 239 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 234 సిక్సర్లతో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ, అన్ని ఫార్మాట్లను కలిపి అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో 461 మ్యాచ్‌ల్లో గేల్ వెయ్యి 56 సిక్సర్లు బాదాడు. కీరన్ పొలార్డ్ 579 మ్యాచ్‌ల్లో 764 సిక్సర్లు, ఆండ్రీ రసెల్ 393 మ్యాచ్‌ల్లో 517 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
మరోవైపు ఈసీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) రాత మారడం లేదు. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చివరి ఓవరులో బోల్తా పడింది. ఐపీఎల్ 2022లో 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై..ఆరింటిలో ఓడిపోయి..రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈసీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరడం సీఎస్‌కే అసాధ్యమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 4న బెంగళూరుతో జడేజా సేన తలపడనుంది.
Also read:Pregnant dies in ambulance: అంబులెన్స్‌లోనే గర్భిణి మృతిపై విచారణకు కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook