Denied admission by five hospitals in Hyderabad, pregnant woman suspected with COVID-19 positive dies in ambulance: హైదరాబాద్: గర్భిణికి చికిత్స అందించడానికి ఐదు ఆస్పత్రులు నిరాకరించడంతో హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కి చెందిన పావని అనే గర్భిణి అంబులెన్సులోనే మృతి చెందిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కళ్ల ముందే రెండు ప్రాణాలను పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న పావని తల్లికి ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే కొన్ని గంటల్లోనే మరో చేదు అనుభవం ఎదురైంది. గర్భిణి అయిన పావనిని ఖననం చేసేందుకు మల్లాపూర్ స్మశానవాటికకు తీసుకెళ్లగా.. తల్లిబిడ్డను వేరు చేయందే పావని మృతదేహాన్ని ఖననం చేయలేం అని స్మశానవాటికలో పనిచేసేవాళ్లు నిరాకరించారు.
అప్పటికే ఉదయం నుంచి ఐదు ఆస్పత్రులు తిరిగినా తన బిడ్డను, ఆమె కడుపులో ఉన్న పసికందును కాపాడుకోలేకపోయానే అనే దుఖంలో ఉన్న పావని తల్లికి ఇది మరో ఊహించని షాక్. మళ్లీ పావని మృతదేహంతో ఆస్పత్రులకు వెళ్లినా.. ఆస్పత్రులన్నీ కొవిడ్-19 పేషెంట్స్‌తో (COVID-19) నిండి ఉండటం, అప్పటికే పావని కరోనాతో చనిపోయిందనే భావన ఉండటం వల్ల పావని మృతదేహం నుంచి పసికందు మృతదేహాన్ని వేరు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ పరిస్థితుల్లో పావని మృతదేహాన్ని తీసుకుని ఇంటికే వెళ్లాల్సి వచ్చింది.
Also read : Black Fungus: 52 మంది ప్రాణాలు తీసిన బ్లాక్ ఫంగస్
ఈ హృదయ విదారక ఘటనపై మేడ్చల్ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి (Collector Sweta Mahanti) విచారణకు ఆదేశించారు. ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశాల మేరకు మేడ్చల్ డీఎంహెచ్ఓ మల్లాపూర్‌లో మృతురాలు పావని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి అసలేం జరిగిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ నుంచి వచ్చిన అధికారులు, పోలీసుల బృందం పావనిని చికిత్స కోసం తీసుకెళ్లిన ఆస్పత్రులకు సైతం వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో, ఎందుకు పావనికి చికిత్స నిరాకరించాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
Also read: Toukde Cyclone: అరేబియా సముద్రంలో తీవ్ర తుపాను హెచ్చరిక
Also read : Case on ABN and Tv5: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుతో పాటు ABN,Tv5లపై కూడా కేసులు నమోదు