ఐపీఎల్ 11 ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్లు బాగానే రాణించారు. తన స్థాయి ప్రదర్శనను  కెప్టెన్‌ విలియమ్సన్‌ (47; 36బంతుల్లో 5×4, 2×6) కనబరచకపోయినా.. జట్టుకి మాత్రం స్కోరు పరంగా ముందుకువెళ్లేందుకు మంచి ఇన్నింగ్సే ఆడాడు. కానీ చెన్నై బౌలర్లను కచ్చితంగా మెచ్చుకోవాలి. బ్యాట్స్‌మన్‌‌ను కట్టడి చేయడానికి బాగానే కష్టపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే యూసఫ్‌ పఠాన్‌(45నాటౌట్‌; 25బంతుల్లో 4×4, 2×6) రెచ్చిపోయి ఆడడంతో 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు పరుగులు చేసి ప్రత్యర్థికి మంచి టార్గెటే ఇచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఆదిలోనే హంసపాదులా రెండో ఓవర్‌ ఐదో బంతికే ఓపెనర్‌ గోస్వామి రనౌట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. అయితే శిఖర్‌ ధావన్‌, విలియమ్సన్‌ పార్టనర్ షిప్ స్కోరుబోర్డును పరుగెత్తించడంతో జట్టు ఆశలు పుంజుకున్నాయి. 


కానీ జడేజా ఈ జోడిని విడదీసి కథను మార్చేశాడు. తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికే మంచి ఊపు మీదున్న ధావన్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్‌గా చేశాడు. ఆ తర్వాత విలియమ్సన్‌ కొంతమేరకు ఆటను రక్తి కట్టించడానికి ప్రయత్నించినా..  కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో ధోనీ స్టంప్‌ ఔట్‌ అవ్వడంతో గేమ్ సంకటంలో పడింది.


అయితే షకిబ్‌ అల్‌ హసన్‌ (23; 15బంతుల్లో 2×4, 1×6),  బ్రాత్‌వైట్‌ (21; 11బంతుల్లో 3×6)  కొంతమేరకు  పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నంలో చేయడంతో సన్‌రైజర్స్ చెప్పుకోదగ్గ స్కోరే చేయగలిగింది. యూసఫ్‌ పఠాన్‌ కూడా అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆడడంతో ప్రత్యర్థి ముందు 179 పరుగుల టార్గెట్ ఉంచగలిగింది.