Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలకమైన, ఆశ్చర్యకరమైన పరిణామం జరిగింది. దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఈసారి ఏకంగా ఓ పార్టీనే నిందితుడిగా చేర్చుతోంది. ఆశ్చర్యంగా ఉందా. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో సంచలనం రేపిన కేసు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తుల్ని ఇప్పటికే అటు ఈడీ లేదా సీబీఐ అరెస్ట్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కుమారుడిని, కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసిన ఈడీ తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం అరెస్టు చేసింది. అంతకుముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తరువాత ఇక ఈ కేసులో అరెస్టులు ఉండవని భావించారు. కానీ ఇప్పుడు ఈడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి వ్యక్తుల్ని కాకుండా పార్టీని టార్గెట్ చేసింది. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీనే నిందితుడిగా ఈ కేసులో చేర్చుతున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఓ కేసులో రాజకీయ పార్టీని నిందితుడిగా చేర్చడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు ఇంకా జైళ్లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం జూన్ 1 వరకూ మద్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న అరవింద్ కేజ్రీవాల్ తిరిగి జూన్ 2న సరెండర్ కావల్సి ఉంది. ఇప్పుడు ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీనే నిందితుడిగా చేర్చడం షాకింగ్ పరిణామం. న్యాయపరంగా ఇదెలా సమర్ధనీయమో తెలియదు కానీ ఆప్ నేతలు ఇంకా స్పందించలేదు. 


Also read: Covid New Variant FLiRT: భయపెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ FLiRT, ఇండియాలో కేసుల సంఖ్య



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook