Covid New Variant FLiRT: కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదలడం లేదు. గత ఏడాదికాలంగా కరోనా వైరస్ ప్రస్తావన లేక అందరూ హాయిగా ఊపిరిపీల్చుకుంటున్న వేళ కొత్త కోవిడ్ వేరియంట్ వెలుగు చూసింది. పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. కొత్త కరోనా వేరియంట్‌ను FLiRTగా అభివర్ణిస్తున్నారు.
కరోనా కొత్త వేరియంట్ FLiRT ఇప్పుడు ప్రపంచాన్నే కాదు ఇండియాను కూడా ఆందోళన కల్గిస్తోంది. యూకే, అమెరికా, దక్షిణ కొరియాతో పాటు ఇండియాలో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో అప్పుడే 250 కేసులు దాటేశాయి. అటు మహారాష్ట్రలో కొత్త కోవిడ్ 19 ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ KP.2 కేసులు 91 నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నెలలో కొత్త కోవిడ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. పూణేలో 51 కేసులు, ధానేలో 20 కేసులున్నాయి. ఒమిక్రాన్ జేఎన్.1, కేపీ.2 నుంచి రూపాంతరం చెందిందే కొత్త కోవిడ్ వేరియంట్ FLiRT అని తెలుస్తోంది.
ఈ కొత్త వేరియంట్ సోకితే ఎగువ శ్వాసకోశాల్ని ప్రభావితం చేస్తుంది. జ్వరం, చలి, గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, రుచి-వాసన కోల్పోవడం, కడుపు నొప్పి వంటి లక్షణాలుంటాయి. తేలికపాటి డయేరియా లక్షణాలు, వాంతులు కూడా ఉండవచ్చు. ఈ వేరియంట్ నుంచి రక్షించుకోవాలంటే కోవిడ్ 19లో చేసినట్టే జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ వినియోగం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, ఆరోగ్యకరమైన పదార్ధాలు తీసుకోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలి.
FLiRT అనేది కోవిడ్ వేరియంట్ అయిన్ ఒమిక్రాన్ వంశానికి చెందింది. వ్యాక్సిన్లు, ఇన్‌ఫెక్షన్ల నుంచి ఇమ్యూనిటీ పొందే సామర్ధ్యం కలిగి ఉంది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం తీవ్ర అనారోగ్యం కలగకపోవచ్చు. చాలా వేగంగా వ్యాపిస్తుంది. శ్వాస నుంచి వచ్చే డ్రాప్‌లెట్స్ ద్వారా వేగంగా వ్యాపిస్తుంది.
Also read: Narendra Modi Nomination: వారణాసిలో ధూంధాంగా ప్రధాని నామినేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook