PAK Vs ENG: పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ పరుగుల వరద.. స్టేడియంపై డ్యాన్స్‌తో అదరగొట్టిన మహిళ.. వీడియో వైరల్
Woman Dance During Pak Vs Eng: పాకిస్థాన్ బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ఆడుతోంది టెస్ట్ మ్యాచ్ అని మర్చిపోయి తొలి రోజు టీ20 తరహాలో చెలరేగి ఆడారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ మహిళ చీరకట్టులో స్టేడియం బయట నుంచి డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Woman Dance During Pak Vs Eng: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రావల్పిండి వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు 75 ఓవర్లలోనే 506 పరుగులు చేసింది. శుక్రవారం రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్.. 657 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.
మొదటి రోజు ఇంగ్లండ్ రోజు మొత్తం బ్యాటింగ్ చేయగా.. ఓ పాక్ మహిళ తన డ్యాన్స్‌తో అందరి మనసులు గెలుచుకుంది. గురువారం ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో 42వ ఓవర్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం జరిగింది. జో రూట్, ఒలియన్ పోప్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. అంతకు కాసేపు ముందే ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఇంతలో హఠాత్తుగా స్టేడియం బయట చీర కట్టుకున్న ఓ మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
కెమెరా కూడా వెంటనే ఆ మహిళ డ్యాన్స్‌ను ఫోకస్ చేసింది. ఈ సీన్ చూసిన వ్యాఖ్యాత కూడా వావ్ ఎంత అద్భుతమైన దృశ్యం అని అన్నాడు. ఆ మహిళ డ్యాన్స్ చూసి ప్రతి ఒక్కర ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పాకిస్థాన్ చెత్త బౌలింగ్‌ను ఓ మహిళ సెలబ్రేట్ చేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చీర్ గర్ల్‌లా డ్యాన్స్ వేసేందుకు ఇది ఐపీఎల్ కాదని మరికొందరు అంటున్నారు. చీర కట్టులో డ్యాన్స్ మాత్రం సూపర్‌గా చేసినందని మెచ్చుకుంటున్నారు.
తొలి రోజు ఇంగ్లండ్ 112 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిరోజు 500 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతకుముందు 1910లో ఆస్ట్రేలియా టెస్టు తొలిరోజు 494 పరుగులు రికార్డును అధికమించింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో ఒకే రోజు నలుగురు సెంచరీలు చేయడం విశేషం.
రెండో రోజు ఇంగ్లండ్ 657 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్టోక్స్ (41) త్వరగా పెవిలియన్‌కు చేరుకోగా.. హ్యారీ బ్రూక్ 153 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివర్లో విల్ జాక్స్ (30), రాబిన్సన్ (37) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో జాహీద్ మహ్మాద్ 4, నసీమ్ షా 3, మహ్మాద్ అలీ 2, హరీస్ రౌఫ్ ఒక వికెట్ తీశారు.
Also Read: Revanth Reddy: రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్.. అలర్ట్ అయిన సీనియర్లు.. హైకమాండ్‌కు ఫిర్యాదు
Also Read: IPL 2023 Auction: ఐపీఎల్‌కు సీఎస్‌కే లెజెండ్ గుడ్ బై.. నిరాశలో చెన్నై ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి