KKR vs RR match: దుబాయ్‌: ఐపీఎల్‌ 2020 నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌ ( Rajasthan Royals ) నిష్క్రమించింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ( Kolkata Knight Riders ) చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. Also read : MS Dhoni about IPL 2021: వచ్చే ఏడాది ఐపిఎల్‌లో పాల్గొనడంపై స్పందించిన ధోనీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతా ( KKR ) నిర్దేశించిన 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్ బ్యాట్స్‌మెన్ ఆదిలోనే తడబడ్డారు. మొదటి 5 ఓవర్లకే జట్టు స్కోర్ 37 పరుగుల వద్ద ఉండగానే 5 వికెట్లు నష్టపోయింది. కోల్‌కతా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ ( Pat Cummins ) (4/34),  వరుణ్‌ చక్రవర్తి(2/19) రాజస్థాన్ రాయల్స్‌ని కోలుకోలేని దెబ్బ తీశారు. శివమ్‌ మావి (2/15) సైతం రాజస్థాన్ రాయల్స్‌ని కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు సాధించే వీలు లేకుండా చేశాడు. దీంతో 20 ఓవర్లలో రాజస్థాన్‌ రాయల్స్ 9 వికెట్లు నష్టపోయి కేవలం 131 పరుగులకే చాప చుట్టేసింది. జోస్‌ బట్లర్‌ ( Jos Buttler 35: 22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌) జట్టులో టాప్‌ స్కోరర్‌‌గా నిలవగా రాహుల్‌ తెవాటియా ( Rahul Tewatia 31 పరుగులు: 27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ ) రాణించడంతో ఓటమి తీవ్రత ఇంకొంతమేర తగ్గించగలిగారు. లేదంటే రాజస్థాన్ రాయల్స్ మరింత దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చేది. Also read : SRH Playoffs: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంత ఈజీ కాదు!


కోల్‌కతా బ్యాటింగ్ విషయానికొస్తే.. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ( Eoin Morgan 68 నాటౌట్:‌ 35 బంతుల్లో 5 ఫోర్లు,  6 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ ( Shubman Gill 36 పరుగులు: 24 బంతుల్లో 6 ఫోర్లు), రాహుల్‌ త్రిపాఠి (39 పరుగులు: 34 బంతుల్లో  4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు రాబట్టారు. చివర్లో ఆండ్రూ రస్సెల్ ( Andre Russell 25 పరుగులు: 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) స్కోర్ వేగాన్ని పెంచాడు. ప్యాట్ కమిన్స్ 15 పరుగులు చేయగా నితీష్ రానా, సునీల్ నరైన్, దినేష్ కార్తిక్ ముగ్గురూ డకౌట్ అయ్యారు. మొత్తంగా కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రాహుల్‌ తెవాటియా (3/25) కోల్‌కతాను కట్టడి చేయగా కార్తీక్‌ త్యాగీ రెండు వికెట్లు, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 4/34 తో 4 వికెట్లు తీయడంతో పాటు 11 బంతుల్లో 15 పరుగులు చేసిన ప్యాట్ కమిన్స్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ( Man of the match ) సొంతం చేసుకున్నాడు. Also read : SRH vs RCB Match IPL 2020: సన్‌రైజర్స్ బౌలర్లపై డివిలియర్స్ ప్రశంసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe