గతంలో ఎన్నడూ లేనంతగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి మజాను అందిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) చేతిలో 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఓటమిపాలైంది. దీంతో ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచి ఉంటే బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరేది. కానీ బ్యాటింగ్‌లో తడబడటంతో విరాట్ కోహ్లీ సేన కీలక సమయంలో చిక్కుల్లో పడింది.
- Also Read : Chris Gayle: తప్పేనన్న యూనివర్సల్ బాస్..
ఈ మ్యాచ్ అనంతరం ప్లే ఆఫ్ మూడు స్థానాల కోసం ఏకంగా ఆరు జట్లు వేచి చూస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఇదివరకే ప్లే ఆఫ్ చేరింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగానూ నిలిచింది. మ్యాచ్ ముగిశాక ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. జోషుహా ఫిలిప్, తన వికెట్లు కోల్పోవడమే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని అభిప్రాయపడ్డాడు. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ చాలా బాగా ఆడిందని ప్రశించాడు. సన్‌రైజర్స్ బౌలర్లు బౌండరీలు బాదే బంతులు విసరలేదన్నాడు.
రషీద్ ఖాన్ లాంటి బౌలర్ బంతులను ఎదుర్కోవడం అంత తేలిక కాదన్నాడు. నేను, ఫిలిప్ వెంట వెంటనే వికెట్లు చేజార్చుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పాడు. మరో 20 లేక 30 పరుగులు చేస్తే ప్రయోజనం ఉండేదని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిందని, ఈ క్రమంలో వికెట్లు కోల్పోయినట్లు డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. బెంగళూరు ప్లే ఆఫ్ చేరాలంటే మాత్రం లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe