Hardik Pandya son Agastya: హార్ధిక్ పాండ్యా తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా!
Hardik Pandya son Agastya | మొన్నటివరకూ జాతీయ జట్టు కోసం క్రికెట్ ఆడి శభాష్ అనిపించుకున్నాడు. సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు పరువు నిలిపాడు హార్దిక్ పాండ్యా. టీ20ల్లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. అరంగేట్ర బౌలర్ నటరాజన్ చేతికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ అందించి పెద్ద మనసు చాటుకున్నాడు
Hardik Pandya son Agastya | మొన్నటివరకూ జాతీయ జట్టు కోసం క్రికెట్ ఆడి శభాష్ అనిపించుకున్నాడు. సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు పరువు నిలిపాడు హార్దిక్ పాండ్యా. టీ20ల్లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. అయినా తన మంచి మనసు చాటుకుంటూ జట్టులో అరంగేట్రం చేసిన బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ చేతికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ అందించి పెద్ద మనసు చాటుకున్నాడు పాండ్యా.
అదేంటీ.. గతంలో మనం చూసిన పాండ్యా వేరు, ఇప్పుడు కనిపిస్తున్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వేరు అని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. దీనంతటికి మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రయ్యాడు. తండ్రి అయిన తర్వాత హార్దిక్ పాండ్యా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కొన్ని రోజుల కిందటి వరకు భారత జట్టు కోసం చెమటోడ్చిన క్రికెటర్లలో పాండ్యా ఒకడు. ప్రస్తుతం పాండ్యా షేర్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Indian Cricketers fined: టీమిండియాకు మరోసారి జరిమానా విధించిన ఐసీసీ
‘ఫ్రమ్ నేషన్ డ్యూటీ టు ఫాదర్ డ్యూటీ’ అని క్యాప్షన్‌తో ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఏడాది జనవరిలో సెర్బియా మోడల్, నటి నటాషా స్టాన్‌కోవిక్‌తో నిశ్చితార్థం జరిగింది. జులై నెలలో స్టాన్‌కోవిక్ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల ఐపీఎల్ 2020 (IPL 2020) సందర్భంగా తన కుమారుడు అగస్త్యను మిస్ అయిన పాండ్యా, ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలోనూ నెలన్నర రోజుల పాటు దూరమయ్యాడు. దీంతో మళ్లీ తన తండ్రి ప్రేమను అగస్త్యకు అందిస్తున్నాడు.
Also Read: Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం ప్రభావం!
ప్రేమగా పాలపీకను అగస్త్య నోటికి అందిస్తూ హార్దిక్ పాండ్యా తన చిన్నారికి పాలు పడుతున్నాడు. ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 2 మిలియన్లకు పైగా లైక్స్, కామెంట్స్‌తో ఫొటో దూసుకెళ్తోంది.
Also Read: Solar Eclipse 2020 Date and Timings: చివరి సూర్యగ్రహణం.. భారత్‌లో పరిస్థితి ఏంటంటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe