Indian Cricketers fined: టీమిండియాకు మరోసారి జరిమానా విధించిన ఐసీసీ

ఆస్ట్రేలియా జట్టుపై 2-1తో టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియాకు జరిమానా విధించింది ఐసీసీ. ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రమైన మూడో టీ20లో స్లో ఓవర్‌ రేటు నమోదు చేసిన కారణంగా (Team India fined for slow over rate) విరాట్ కోహ్లీ సేనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) జరిమానా విధించింది.  

Last Updated : Dec 9, 2020, 07:23 PM IST
  • ఆసీస్‌పై 2-1 తేడాతో టీ20 సిరీస్ వశం
  • భారత ఆటగాళ్లకు ఐసీసీ జరిమానా
  • తప్పిదం ఒప్పుకున్న విరాట్ కోహ్లీ
Indian Cricketers fined: టీమిండియాకు మరోసారి జరిమానా విధించిన ఐసీసీ

Team India fined for slow over rate | ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుపై 2-1తో టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియాకు జరిమానా విధించింది ఐసీసీ. ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రమైన మూడో టీ20లో స్లో ఓవర్‌ రేటు నమోదు చేసిన కారణంగా విరాట్ కోహ్లీ సేనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) జరిమానా విధించింది. వన్డే సిరీస్‌లోనూ భారత్‌కు జరిమానా పడ్డ విషయం తెలిసిందే. తాజాగా టీ20 సిరీస్‌లోనూ స్లో ఓవర్ రేటు నమోదు చేసిన కారణంగా మరోసారి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో విషయాన్ని తెలిపింది.

ఐసీసీ రూల్స్ ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయాలి. కానీ చివరిదైన మూడో టీ20లో భారత జట్టు ఓ ఓవర్ ఆలస్యంగా బౌలింగ్ కోటాను పూర్తి చేసింది. ఐసీసీ ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేటు కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. అంపైర్లు రాడ్‌ టకర్, అబూడ్‌, టీవీ అంపైర్ పాల్‌ రీఫెల్‌ ఫిర్యాదు చేయగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) తమ పొరపాటుని అంగీకరించాడు.

Also Read : Salary Reduce from 2021: వచ్చే ఏడాది మీ జీతం తగ్గవచ్చు.. ఎందుకో తెలుసా!

వన్డే సిరీస్‌ను 2-1తో కోల్పోయిన టీమిండియా, టీ20 సిరీస్‌లో పుంజుకుని 2-1తో సాధించింది. ఇరు జట్లు ఈ పర్యటనలో మూడేసి విజయాలు సాధించాయి. డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆడిలైడ్ వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది.

Also Read : Rise in Prices: టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు షాక్.. త్వరలో భారీగా పెంపు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News