Netizens trolls IND vs SA 3rd umpire over Shardul Thakur was out for No-Ball: మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వివాస్పద రీతిలో ఔట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఠాకూర్ ఔటైన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆటలో మూడో రోజైన మంగళవారం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఔట్ కావడంతో.. నైట్ వాచ్‌మన్‌గా శార్దూల్  క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్‌ (KL Rahul) కు జతగా క్రీజులో నిలబడ్డాడు. ప్రొటీస్ పేసర్లు వికెట్ కోసం ప్రయత్నించినా.. శార్దూల్ ఆ అవకాశం ఇవ్వలేదు. దాంతో రాహుల్-శార్దూల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుగో రోజైన బుధవారం కేఎల్ రాహుల్‌తో కలిసి శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌కు దిగాడు. వచ్చిరావడంతోనే ఓ భారీ సిక్సర్‌తో అభిమానులను అలరించాడు. అయితే దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబడా బౌలింగ్‌లో శార్దూల్ (10; 26 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. రబడా వేసిన బంతిని శార్దూల్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేయగా.. అది కాస్త ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్‌లో ఉన్న మల్డర్ చేతుల్లో పడింది. దాంతో శార్దూల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే రబడా వేసిన బంతి నో బాల్ అని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ యూజర్ ఇందుకు సంబందించిన స్క్రీన్ షాట్స్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 


Also Read: Sudheer Babu- Krithi Shetty: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!!


నిజానికి శార్దూల్ ఠాకూర్‌ (Shardul Thakur)కు కాగిసో రబడా వేసిన బంతి 'నో బాల్' (No-Ball) అని నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఫోటోలలో స్పష్టంగా తెలుస్తోంది. అంపైర్లు ఈ తప్పిదాన్ని గుర్తించి ఉంటే శార్దూల్ ఔటయ్యేవాడు కాదు. ఈ ఫొటోలు చూసిన టీమిండియా క్రికెట్ ఫాన్స్, నెటిజన్లు అంపైర్లపై (3rd Umpire) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'థర్డ్ అంపైర్ నిద్ర పోతున్నావా? ఏంది.. నోబాల్‌కు ఔట్ ఇచ్చాడు 'అని ఒకరు ట్వీట్ చేయగా.. 'నాగార్జున గారూ.. ఈ థర్డ్ అంపైర్ మాకొద్దు! ప్లీజ్ వెంటనే తీసేయండి సర్' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'గ్రేట్ అంపైర్', 'సూపర్ అంపరింగ్', 'నీకు ఓ దండం సామి' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 




నాలుగో రోజు లంచ్‌ బ్రేక్ సమయానికి భారత్ (IND vs SA) మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (18), టెస్ట్ స్పెసలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా (12)లు ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ (130) ఆధిక్యం కలుపుకుని టీమిండియా లీడ్‌ 209 పరుగులకు చేరింది. ఓవర్‌నైట్‌ స్కోరు 16/1తో ఇవాళ ఉదయం ఆటను ప్రారంభించిన టీమిండియాకు రబాడ షాక్ ఇచ్చాడు. ఓవర్‌నైట్‌ స్కోరుకు శార్దూల్‌ (10) మరో ఆరు పరుగులు జోడించి ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన పుజారాతో కలిసి కేఎల్ రాహుల్ (23) ఇన్నింగ్స్‌ నిర్మించేందుకు ప్రయత్నించాడు. అయితే ఎంగిడి వేసిన అద్భుత బంతికి పెవిలియన్‌కు చేరాడు. ఆపై విరాట్ కోహ్లీ, పుజారా ఆచితూచి ఆడారు. 


Also Read: Sri Chaitanya College students: శ్రీ చైతన్య కాలేజీలో కరోనా కలకలం.. 30 మంది విద్యార్థులకు పాజిటివ్!!






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి