గాళ్ ఫ్రెండ్‌తో హార్ధిక్ పాండ్య రొమాన్స్.. వైరల్‌గా మారిన క్వారంటైన్ పిక్
కరోనావైరస్ను అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా నిత్యం ఏదో ఓ బిజీ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండే సెలబ్రిటీలు ఈ లాక్‌డౌన్ సమయాన్ని తమకు తోచినట్టుగా సరదాగా గడుపుతున్నారు.
కరోనావైరస్ (Coronavirus)ను అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) విధించిన నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా నిత్యం ఏదో ఓ బిజీ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండే సెలబ్రిటీలు ఈ లాక్‌డౌన్ సమయాన్ని తమకు తోచినట్టుగా సరదాగా గడుపుతున్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. తరచుగా విదేశాలకు వెళ్తూ, విదేశీ ఆటగాళ్లతో సమయం గడిపే క్రికెటర్లు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌కి (Home quarantine) పరిమితమైన సంగతి తెలిసిందే. అలా క్వారంటైన్‌లో ఉన్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) సైతం తన గాళ్ ఫ్రెండ్ మోడల్, నటి అయిన నతాషా స్టాంకోవిక్ (Natasa Stankovic)తో కలిసి ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు... క్వారంటైన్ పీరియడ్‌ను తాము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అభిమానులకు తెలియజేసేలా ఆ ఫోటోలను హార్ధిక్ పాండ్య గాళ్ ఫ్రెండ్ నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ నటాషా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులోని ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
దుబాయ్‌లో నతాషాకు లవ్ ప్రపోజ్ చేస్తూ హార్థిక్ పాండ్య ఓ రింగ్‌ను బహూకరించాడు. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా మారింది. ఇక నతాషా ప్రొఫైల్ విషయానికొస్తే, సెర్బియన్ మోడల్ అయిన నతాషా.. ప్రకాష్ ఝా తెరకెక్కించిన 'సత్యాగ్రహ' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చుకుంది. 2014-15లో అప్పటి బిగ్ బాస్-8వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ఫేమ్ అయ్యింది. ఆ తర్వాత ఫుక్రె మూవీ నుండి 'మెహబూబా', 'డాడీ' నుండి 'జిందగీ మేరీ డాన్స్ డాన్స్' లాంటి హిట్ సాంగ్స్‌కి స్టెప్పేసి బాలీవుడ్‌ని షేక్ చేసింది.
Read also : 2,535 మంది అరెస్ట్.. 1,636 వాహనాల సీజ్!
బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిన తమిళ, కన్నడ భాషల్లోనూ పలు ఐటంసాంగ్స్‌లో నతాషా స్టెప్పేసి ఆకట్టుకుంది. చివరిసారిగా నాచ్ బలియే అనే రియాలిటీ షోలో టీవీ నటుడు, స్నేహితుడు అయిన అలీ గోనితో కలిసి పాల్గొంది.
Read also : లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఉచితంగా భోజనం
ఇదిలావుంటే కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 21,000 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.