క్రికెట్ లో అతిపెద్ద వేడుక మళ్లీ వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2020) లో క్రికెట్ సూపర్ స్టార్లు అద్దరగొట్టనున్నారు. అయితే కేవలం పీల్డ్ లో మాత్రమే కాదు..సోషల్ మీడియాలో ( Social Media ) కూడా గేమ్ ప్రారంభం అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం రోజు హార్ధిక్ పాండ్య, ఏబి డి విలియర్స్ మధ్యట ట్విట్టర్ లో (Twitter ) ఫన్నీ సైటైర్ల వార్ జరిగింది.  ముంబై ఇండియన్స్ టీమ్ కు చెందిన  ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య .. ఎమ్మెస్ ధోనిని ట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. గల్లీ క్రికెట్ రూల్స్ అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశాడు పాండ్య.


ALSO READIPL Records: ఐపిఎల్ ఫైనల్స్ లో 50 కొట్టిన కెప్టెన్లు .. వారి పేర్లు ఇవే


ఇందులో 20 సెకన్ల వీడియో పోస్ట్ చేశాడు పాండ్య. డ్రీమ్ 11 కు సంబంధించిన లేటెస్ట్ క్యాంపెయిన్ లో ధోని ( MS Dhoni ) కనిపిస్తున్న వీడియో అది. ఇందులో కొంత మంది యువకులతో కలిసి ధోని గల్లీ క్రికెట్ ఆడుతుంటాడు. గేమ్ మధ్యలో అద్భుమైన షాట్ కొట్టి బౌండరీ సాధిస్తాడు. కానీ బాల్ డైరక్ట్ గా అక్కడే ఉన్న స్కూటర్ కు తగలడంతో ఔట్ అవుతాడు. గల్లీ క్రికెట్ రూల్స్ ప్రకారం స్కూటర్ కు డైరక్ట్ గా బాల్ తగిలితే ఔట్ ఇవ్వడం మనకు తెలిసిందే. ఈ విషయాన్ని గమనించిన పాండ్య ఇలా ట్వీట్ చేశాడు.



అయితే పాండ్య( Hardik Pandya ) కామెంట్ కు ధోనీ అభిమానులు కూడా ఫన్నీగా రిప్లై ఇవ్వడం ప్రారంభించారు. ఇంతలోనే  ఆర్సీబి ( RCB ) అటాకింగ్ బ్యాట్స్ మెన్ డి విలియర్స్ ఎంటర్ అయి.. ధోనిని సపోర్ట్ చేయడం ప్రారంభించాడు. డి విలియర్స్ మరో 20 సెకన్ల వీడియో షేర్ చేశాడు. ఇందులో పాండ్య కూడా ఒక సిక్స్ కొడతాడు. కానీ గల్లీ క్రికెట్ మ్యాచ్ అవడంతో అతను మ్యాచ్ ఓడిపోవాల్సి వస్తుంది. దాంతో పాటు రూ.20 కూడా ఓడిపోతాడు.  డి విలియర్స్ పోస్ట్ చేస్తూ ఇలా రాశాడు.



ALSO READCricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?



నీకు 20 బక్స్ ఛేంజ్ కావాలా  @hardikpandya7? #20RupeesLoan #YahanSabSameHai #YeApnaGameHai #Dream11IPL @Dream11”


ఈ వీడియోలు డ్రీమ్ 11 ( Dream11) ఇటీవలే ప్రారంభించిన ఏ అప్నా గేమ్ హైలో భాగంగా షేర్ చేశారు.


చాలా కాలంగా గాయాలతో బాధ పడుతున్న హార్ధిక్ పాండ్య ఈ సారి ఐపిఎల్ అంతా సిద్ధం అని ప్రకటించాడు.డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కు పాండ్య ఫామ్ లో ఉండటం చాలా ముఖ్యం.  అదే సమయంలో టీమ్ ఇండియా నుంచి రిటైర్మెంటించిన ధోని ఆటను చూడటానికి అభిమానులు వేచిచూస్తున్నారు. అదే సమయంలో డివిలియర్స్ ఆల్ రౌండింగ్ ఫెర్ఫార్మెన్స్ చూడటానికి ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. మొత్తానికి ఐపిఎల్ 2020 పై క్రికెట్ లవర్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు.


ALSO READ: Bio-bubble: బయోబబుల్ అంటే ఏంటి? ఆటగాళ్లు పూర్తిగా సురక్షితమా ?


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR