భారత క్రికెట్ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గురువారం నాడు విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 871 పాయింట్లతో కోహ్లీ నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకోగా, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 855 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్‌లు టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ జట్టులోకి సచిన్ తనయుడు



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేన్ విలియమ్సన్ రెండు స్థానాలు ఎగబాకి 765 పాయింట్లతో 6వ ర్యాంకు, ఆరోన్ ఫించ్ 7, డేవిడ్ వార్నర్ 2 స్థానాలు తగ్గి 8వ స్థానం, క్వింటన్ డికాక్ 9, మూడు స్థానాలు మెరుగు పరుచుకుని జానీ బెయిర్ స్టో 10వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రాణించడంతో టాప్ 10లో బెయిర్ స్టో చోటు దక్కించుకున్నాడు.  Adam Zampa: చహల్‌తో కలిసి బౌలింగ్ ఆస్వాదిస్తా 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR