ICC T20 Rankings 2023: ఐపీఎల్ 2023లో పేలవ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 906 పాయింట్లతో మెుదటి స్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ 811 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత స్థానాల్లో 755 పాయింట్లుతో బాబర్ అజామ్, 748 పాయింట్లుతో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రామ్, 745 పాయింట్లుతో కివీస్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే కొనసాగుతున్నారు. ఈ జాబితాలో భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 15వ స్థానంలో కొనసాగుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే రీసెంట్ గా ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సూర్య వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. తొలి మూడు మూడు మ్యాచ్‌లలో 15, 01 మరియు సున్నా పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్ లు లేకపోవడమే పెద్దగా లేకపోవడమే సూర్య నెంబర్ వన్ స్థానంలో కొనసాగడానికి కారణం. శనివారం న్యూజిలాండ్‌- పాకిస్థాన్ జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ర్యాంకింగ్స్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 


Also Read: Sara Tendulkar: హీరోయిన్స్‌ను తలదన్నేలా.. సారా టెండూల్కర్ గోవా ట్రిప్ పిక్స్ చూశారా..!


బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 710 రేటింగ్ పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు.  రెండో స్థానంలో ఫజల్లా ఫరుఖీ,  ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. యువ స్పిన్నర్ మహిష్ తీక్షణ ఐదో స్థానికి చేరుకున్నాడు. టాప్ 10 జాబితాలో ఒక్క భారతీయ బౌలర్ కూడా లేకపోవడం విశేషం. 


Also Read: MS Dhoni Seat: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి