Kane Williamson: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మరోసారి టాప్ లేపిన కేన్ విలియమ్సన్
ICC Test Player Rankings: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టిన కేన్ విలియమ్సన్ ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. డబ్ల్యూసీ ఫైనల్ ప్రదర్శనతో కేన్ విలియమ్సన్ పాయింట్లు మెరుగయ్యాయి.
ICC Test Player Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌లలో మెరుగైన ప్రదర్వన చేసిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమన్సన్ ఐసీసీ తాజాగా ప్రకటించిన బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టిన కేన్ విలియమ్సన్ ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final) తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా టెస్ట్ క్రికెట్‌లో 901 పాయింట్లకు చేరుకుని నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 891 పాయింట్లతో స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో నిలిచాడు. డబ్ల్యూసీ ఫైనల్ ప్రదర్శనతో కేన్ విలియమ్సన్ పాయింట్లు మెరుగయ్యాయి.
Also Read: IPL 2021: ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు BCCI యత్నాలు, త్వరలోనే కీలక నిర్ణయం
టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ ర్యాంకుకు చేరుకున్నాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్‌లో బెస్ట్ ర్యాంకు సాధించాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత టెస్ట్ ఓపెనర్లలో అత్యుత్తమ ర్యాంక్ రోహిత్‌దే కావడం గమనార్హం. గత వారం ఆల్ రౌండర్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయాడు.
Also Read: T20 World Cup venue shifted to UAE: దుబాయ్‌లోనే టీ20 వరల్డ్ కప్: సౌరవ్ గంగూలీ
బౌలర్ల విషయానికొస్తే ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియా బౌలర్ అశ్విన్ 865 పాయింట్లతో రెండో స్థానం, డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించిన కివీస్ పేసర్ టిమ్ సౌథీ మూడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జోష్ హజెల్‌వుడ్, నీల్ వాగ్నర్ టాప్5లో చోటు దక్కించుకున్నారు. డబ్ల్యూసీ ఫైనల్లో రాణించిన మరో బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండు స్థానాలు మెరుగు పరుచుకుని 11వ స్థానానికి చేరాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook