ICC Test rankings: Rishabh Pant Becomes Top-Ranked Wicket-Keeper In Batting List: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కీలక ప్రదర్శన చేసి టీమిండియా సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బెస్ట్ ర్యాంక్ సాధించిన వికెట్ కీపర్‌గా నిలిచాడు పంత్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పంత్(Rishabh Pant) తన కెరీర్‌2లో బెస్ట్ టెస్టు ర్యాంకు సాధించాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో నిలిచాడు పంత్. భారత్ అపూర్వ విజయాన్ని సాధించడంలో రిషబ్ పంత్ తనదైన ప్రదర్శన చేసి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లలో అత్యుత్తమ టెస్టు ర్యాంకు అందుకున్నాడు పంత్.


Also Read: Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 32 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్



రిషబ్ పంత్ తర్వాత దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ 15వ ర్యాంకులో ఉన్నాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో రాణించిన మార్నస్ లబుషేన్ టీమిండియా(Team India) కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ పర్యటన మధ్యలోనే భారత్‌కు తిరిగొచ్చిన కోహ్లీ 4వ ర్యాంకుకు పడిపోయాడు. తాజాగా ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ ఉన్నాడు.


Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ 



గబ్బాలో జరిగిన టెస్టులో భారత యువ క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టాడు. బ్రిస్బేన్ వేదికగా గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా టెస్ట్ కెరీర్‌లో 1000 పరుగుల మార్కు చేరుకున్నాడు పంత్. 27వ ఇన్నింగ్స్‌లోనే పంత్ ఈ ఫీట్ చేరుకోగా, ఎంఎస్ ధోనీ 32వ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్క్ చేరాడు.


Also Read: Voter ID Updation: మీ ఓటర్ ఐడీలో తప్పులున్నాయా.. నిమిషాల్లో సరిదిద్దుకోండి


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook