IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!
IND vs AFG 02nd T20I: ఇండోర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ రెండో టీ20 మ్యాచ్ లో తలపడేందుకు రెడీ అయ్యాయి. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు.
IND vs AFG 02nd T20I Live updates: అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20 గెలిచిన ఊపులో రెండో టీ20కి రెడీ అయింది టీమిండియా. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గి సిరీస్ ను సమయం చేయాలని చూస్తోంది అప్ఘాన్ జట్టు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 14 నెలల విరామం తర్వాత టీ20ల్లో ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మ్యాచ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. 2022 నవంబరులో ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత ఇప్పుడే ఆడుతున్నాడు.
ఇవే మార్పులు..
కోహ్లీ రాకతో భారత జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. రోహిత్ కు జోడిగా జైస్వాల్ ఓపెనర్‌గా దిగనున్నాడు. తిలక్ వర్మను కూడా పక్కన బెట్టారు. టీమిండియా గత మ్యాచ్ లాగానే ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పినర్లతో బరిలోకి దిగుతుంది. అఫ్గాన్ జట్టులో రెహ్మత్ షా స్థానంలో స్పిన్నర్ నూర్ అహ్మద్ కు ఛాన్స్ ఇచ్చారు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్
అఫ్గానిస్తాన్: రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్‌జయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయీబ్, కరీమ్ జనత్, ఫజల్‌హక్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్
Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..
Also read: Tim Southee: పొట్టి క్రికెట్ లో టిమ్ సౌథీ ప్రపంచ రికార్డు.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook