India Vs Bangladesh Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. సూపర్‌-8 అఫ్గానిస్థాన్‌ను ఓడించిన భారత్.. నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సెమీస్‌ చేరేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఇక ఈ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌కు కీలకంగా మారింది. సూపర్-8లో ఆసీస్‌ చేతిలో బంగ్లాకు ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇంటి ముఖం పడుతుంది. టీమిండియాకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫామ్ ఆందోళన కలిగిస్తుండగా.. బౌలింగ్ దళం మాత్రం దుమ్ములేపుతోంది. భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. ఏ మాత్రం అవకాశం దొరికిన బంగ్లాదేశ్ షాకిచ్చేందుకు రెడీగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: OnePlus Nord 3 Price: మొబైల్‌పై డబ్బు వేస్ట్‌ చేసుకోకండి.. OnePlus Nord 3 ఇప్పుడే కేవలం రూ.18 వేలకే..


హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు 13 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్  12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే.. ఆంటిగ్వాలోని పిచ్ భిన్నంగా ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు సహకరిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ను ఈజీగా పరుగులు చేస్తున్నారు. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. 


తుది జట్లు ఇలా.. (అంచనా)


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్/శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.


బంగ్లాదేశ్‌: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహ్మన్.


IND Vs BAN Dream11 Prediction Team Tips:


==> వికెట్ కీపర్: రిషబ్ పంత్, లిట్టన్ దాస్
==> బ్యాట్స్‌మెన్: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్
==> ఆల్ రౌండర్: అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, షకీబుల్ హాసన్, రిషద్ హొస్సేన్
==> బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ముస్తాఫిజుర్ రెహ్మన్


Also Read: Pawan Kalyan: పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter