OnePlus Nord 3 Price: మొబైల్‌పై డబ్బు వేస్ట్‌ చేసుకోకండి.. OnePlus Nord 3 ఇప్పుడే కేవలం రూ.18 వేలకే..

OnePlus Nord 3 Price Dropped: అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్‌ మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 22, 2024, 12:32 PM IST
OnePlus Nord 3 Price: మొబైల్‌పై డబ్బు వేస్ట్‌ చేసుకోకండి.. OnePlus Nord 3 ఇప్పుడే కేవలం రూ.18 వేలకే..

OnePlus Nord 3 Price Dropped:ఎప్పటి నుంచో OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ముఖ్యంగా వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారికి దాదాపు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా  OnePlus Nord 3 మొబైల్‌ కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 20,000 కంటే తక్కువ ధరలోనే పొందవచ్చు. అయితే దీనిపై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ధర రూ.33,999లతో లభిస్తోంది. ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా  8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,998లతో అందుబాటులో ఉంది. దీంతో ఇప్పుడే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.14,001పైగా డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.1,500 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుంది. దీంతో బ్యాంక్‌ ఆఫర్స్‌, ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అన్ని పోను రూ.18,498 ఈ OnePlus Nord 3 మొబైల్‌ను పొందవచ్చు. 

OnePlus Nord 3 మొబైల్‌ ఫీచర్స్‌:
ఈ OnePlus Nord స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 3 6.74-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED ప్యానెల్ డిప్లే‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120 Hz  రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో లభిస్తోంది. అలాగే అద్భుమైన HDR10+ సపోర్ట్‌ ఫీచర్స్‌తో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రోటక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సెటప్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 9000 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వస్తోంది. దీంతో పాటు Mali-G710 MC10 GPU సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవేకాకుండా అనేక రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్‌
80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5,000 mAh బ్యాటరీ
అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌
అలర్ట్ స్లైడర్
Wi-Fi డైరెక్ట్ 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
బ్లూటూత్ 5.2
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్
8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ 
OISతో 2-మెగాపిక్సెల్ ఇన్-డెప్త్ సెన్సార్
16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News