Jasprit Bumrah will play 2nd T20I in place of Umesh Yadav in IND vs AUS 2nd T20I: మొహాలీ వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. బ్యాటర్లు అదరగొట్టినా.. పసలేని బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో రోహిత్ సేన మూల్యం చెల్లించుకుంది. మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో పేసర్లు భారీగా పరుగులు ఇచ్చుకోవడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తోంది. టీ20 ప్రపంచకప్ 2022 ముందు సొంతగడ్డపై భారత్ ఇలా ఓటమిపాలవ్వడం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లను ఆందోళనకు గురిచేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ నాగ్‌పూర్ వేదికగా సెప్టెంబర్ 23న జరగనుంది. ఈ మ్యాచ్‌‌ టీమిండియాకు చావోరేవో లాంటిది. రెండో టీ20 మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీసును ఆస్ట్రేలియాకు అప్పగించాల్సి ఉంటుంది. దాంతో ఈ మ్యాచులో భారత్ పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు అవసరం లేకున్నా.. బౌలింగ్‌లో కీలక మార్పు జరగనుందని తెలుస్తోంది. 


రెండో టీ20 మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు ఓ క్రీడా ఛానెల్ తమ కథనంలో పేర్కొంది. వెన్నునొప్పి నుంచి కోలుకున్న బుమ్రాపై భారం వేయకూడనే తొలి టీ20 మ్యాచ్‌లో ఆడించలేదని బీసీసీఐ అధికారి చెప్పారట. ఇప్పుడు అతడికి రెస్ట్ దొరకడం, రెండో టీ20 మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండడంతో బుమ్రా నేటి మ్యాచులో ఆడుతాడని స్పష్టం చేశారట. ఉమేష్ యాదవ్ స్థానంలో యార్కర్ కింగ్ ఆడుతాని సమాచారం. స్వింగ్ మాస్టర్ దీపక్ చహర్ కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. అతడు హర్షల్ పటేల్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. 


సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు ఇచ్చినా.. అతడు కొనసాగే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్,  భువనేశ్వర్ కుమార్ ఆడితే భారత్ బౌలింగ్ పటిష్టంగా మారనుంది. ఇక రెండో టీ20 మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడుతున్నడని తెలిసి భారత ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ పేసర్ బుమ్రా వచ్చేస్తున్నాడు, రెండో టీ20లో టీమిండియాదే విజయం అని కామెంట్స్ చేస్తున్నారు. 
Also Read: రాణించిన హర్మన్‌ప్రీత్, రేణుక... 23 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై వన్డే సిరీస్ కైవసం..


Also Read: IND vs AUS: రేపే భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్‌..అతడి రాకపైనే టీమిండియా ఆశలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.