IND Vs AUS 2nd Test: 36 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు.. కంగారూల వెన్నులో వణుకు..!
Team India Test Record In Delhi: ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో ఆసీస్‌తో టీమిండియా తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో భారత్ రికార్డు చూస్తే.. ప్రత్యర్థి జట్టుకు వణుకుపుడుతోంది. గత 36 ఏళ్లుగా ఢిల్లీలో భారత్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తరువాతి మ్యాచ్‌లోనూ మరోసారి టీమిండియానే విజయం వరించే అవకాశం ఉంది.
Team India Test Record In Delhi: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా విజయంతో ప్రారంభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు చెలరేగగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా పూర్తిగా స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ నల్లమట్టితో తయారైనందున ఇక్కడ బంతి పెద్దగా బౌన్స్ అయ్యే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడం కంగారూ జట్టుకు మరోసారి సవాలుగా మారనుంది. ఫిబ్రవరి 17 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.
ఢిల్లీ మైదానంలో టీమిండియా టెస్టు రికార్డును పరిశీలిస్తే.. గత 36 ఏళ్లుగా ఇక్కడ ఏ ప్రత్యర్థి జట్టు భారత్‌ను ఓడించలేదు. 2017లో శ్రీలంకతో ఇదే మైదానంలో చివరి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 243 పరుగులతో రాణించాడు. అయితే ఈ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇప్పటివరకు ఢిల్లీ గడ్డపై భారత్.. 34 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అందులో 13 మ్యాచ్‌లు గెలుపొందింది. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 1987లో ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక తరువాత ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా భారత్ ఓడిపోలేదు. గత 36 ఏళ్లుగా ఈ స్టేడియంలో జెత్రయాత్ర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని చూస్తోంది.
ఢిల్లీ గడ్డపై ఆసీస్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒక మాత్రమే గెలిచారు. 1959 పర్యటనలో కంగారూ జట్టు ఈ మైదానంలో టీమిండియాను ఇన్నింగ్స్ 127 పరుగుల తేడాతో ఓడించింది. మరో 3 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఓడిపోగా.. 3 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఆసీస్ జట్టు చివరిసారిగా 2013 పర్యటనలో ఈ గ్రౌండ్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. అందులో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత్‌తో రెండో మ్యాచ్‌కు కంగారూ జట్టు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లను తీసుకోగా.. ఈసారి ముగ్గురిని ఆడించాలని ప్లాన్ చేస్తోంది. దీంతో టీమిండియాకు గట్టిపోటీ ఎదురుకానుంది.
Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!
Also Read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook