IND vs AUS: ఉప్పల్ మైదానానికి వెళ్లే అభిమానులకు కీలక సూచన ఇదే..!
IND vs AUS: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐతే మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ(HCA) నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది.
IND vs AUS: హెచ్‌సీఏ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిస్తోంది. ఆది నుంచి వివాదాల్లో చిక్కుకుంటోంది. తాజాగా మరోమారు నిర్లక్ష్యం వెలుగు చూసింది. టికెట్లపై మ్యాచ్ టైమింగ్‌ను తప్పుగా ముద్రించారు. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా..సాయంత్రం 7.30 గంటలకు అని ప్రింట్ చేశారు. 10 రోజుల నుంచి టికెట్లు విక్రయిస్తున్నా..ఈ విషయాన్ని హెచ్‌సీఏ అధికారులు గుర్తించలేకపోయారు. టికెట్లపై ఉన్న టైమ్ బట్టి మైదానానికి అభిమానులు చేరుకుంటే ఆర గంట ఆటను మిస్ అయ్యే వారు.
అందుకే మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లే వారంతా సాయంత్రం 7 గంటల కల్లా వెళ్లాల్సి ఉంటుంది. దీనిని అందరూ గుర్తించుకోవాలి. ఉప్పల్ మ్యాచ్‌లో సాయంత్రం 6.30 గంటలకు టాస్ పడనుంది. ఏడు గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ఉప్పల్ మైదానం అంతర్జాతీయ మ్యాచ్ అతిథ్యం ఇస్తోంది. అది నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు టీ20ల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 1-1తో సమంగా నిలిచాయి.
తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడగా..రెండో టీ20లో భారత్ గెలుపొందింది. వర్ష ప్రభావం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. ఈమ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇవాళ ఉప్పల్ వేదికగా కీలక మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈమ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. బుమ్రా రావడంతో టీమిండియా బౌలింగ్ పరంగా పటిష్టంగా మారింది.
బ్యాటింగ్‌లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. దీంతో ఈమ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈసిరీస్ తర్వాత..దక్షిణాఫ్రికాతో టీ20 జరగనుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ ఉంది. అనంతరం భారత జట్టు..టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. అక్టోబర్ 13 నుంచి సెప్టెంబర్ 13 వరకు మెగా టోర్నీ ఉండనుంది.
Also read:Mega 154 Surprise: రవితేజ ఒక్కడే కాదు నాగార్జున-వెంకటేష్ కూడా?
Also read:GVL Narasimha Rao: ఎన్టీఆర్‌ను బీజేపీ ఓన్ చేసుకుంటోందా..జీవీఎల్ ఆసక్తికర ట్వీట్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook