Bangladesh Win By One Wicket Vs India 1st Odi: తొలి వన్డేలో భారత్‌ను బంగ్లాదేశ్ చిత్తుచేసింది. ఆఖర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. బంగ్లా ఆల్‌రౌండర్ మెహీది హసన్ (38) చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. ముస్తాఫిజూర్ రెహ్మాన్ (10)తో కలిసి ఆఖరి వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జోడించి విజయ తీరాలకు చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయింది. కష్టతరం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను భారత బౌలర్లు మొదట ఇబ్బంది పెట్టినా చివర్లో పట్టు విడిచారు. టీమిండియా బౌలర్లలో మహ్మాద్ సిరాజ్ 3, కుల్దీప్ సేన్ 2, వాషింగ్టన్ సుందర్ 2, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌ను బంగ్లాదేశ్ బౌలర్ల బాగా ఇబ్బంది పెట్టారు. కేఎల్ రాహుల్ (73) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం విఫలమయ్యారు. హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ (27), శిఖర్ ధావన్ (7), విరాట్ కోహ్లీ (9), శ్రేయాస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19), షాబాద్ అహ్మాద్ (0), శార్దుల్ ఠాకూర్ (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాటపట్టారు. షకీబుల్ అల్ హాసన్ ఐదు, ఎబాడోత్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీశారు. 


అనంతరం 187 లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను ఆరంభం నుంచే భారత బౌలర్ల చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి బంతికే  వికెట్ తీసి దీపక్ చాహర్ దెబ్బతీశాడు. నజ్ముల్ హుస్సేన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం 26 పరుగుల వద్ద బంగ్లా రెండో వికెట్ కోల్పోయింది. అనాముల్ హక్ ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత కెప్టెన్ లిటన్ దాస్ (41), షకీబ్ అల్ హసన్ (29) జట్టును ఆదుకున్నారు.


వీరిద్దరి భాగస్వామ్యంతో బంగ్లా జట్టు కోలుకున్నట్లే కనిపించింది. అయితే 74 పరుగుల వద్ద లిటన్ దాస్‌ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. కాసేపటికే షకీబుల్ హాసన్‌ను కూడా సుందర్ ఔట్ చేయడంతో 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్ పట్టి షకీబ్ అల్ హసన్‌ను డగౌట్‌కు పంపించాడు. 128 పరుగుల వద్ద మహ్మదుల్లా (14)ను శార్దుల్ ఠాకూర్ ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్ మొదటి బంతికే ముష్ఫికర్ రహీమ్ (18) క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ విజయం దాదాపు ఖాయమని అందరూ అనుకున్నారు.


అరంగేట్ర బౌలర్ కుల్దీప్ సేన్ తన కెరీర్‌లో తొలి వికెట్ తీయడంతో బంగ్లా స్కోరు బోర్డు 134-7గా నిలిచింది. అదే ఓవర్‌లో కుల్దీప్ మరో వికెట్ తీయగా.. హసన్ మహమూద్‌ను మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 136 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలబడింది. ఈ సమయంలోఈ సమయంలో మెహీది హసన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ ఎండ్‌లో ముఫ్తికర్ రెహ్మాన్ నిలబెట్టి చెలరేగి ఆడాడు. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కేఎల్ రాహుల్ విడిచిన సులవైన క్యాచ్‌తో ఊపిరి పీల్చుకున్న హసన్ ఫోర్లు, సిక్సర్లతో బంగ్లాను గెలిపించాడు. 


Also Read: Minister Ktr: తెలంగాణ యువతకు కేటీఆర్ లేఖ.. కష్టపడి చదవండి.. కలల్ని నిజం చేసుకోండి  


Also Read: PM Kisan Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఖాతాల్లోకి నగదు జమ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి