Ind vs Eng 4th Test Live Score Updates: నాలుగో టెస్టులోనూ రాణిస్తున్న టీమిండియా బౌలర్లు, Ben Stokes ఒంటరి పోరాటం
Ind vs Eng 4th Test Live Score Updates: టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. అయినా ఎట్టకేలకు పర్యాటక ఇంగ్లీష్ జట్టు స్కోరు 100 దాటింది. 114 బంతుల్లో టెస్టుల్లో 24వ హాఫ్ సెంచరీని బెన్ స్టోక్స్ సాధించాడు.
Ind vs Eng 4th Test Live Score Updates: టీమిండియా, ఇంగ్లాండ్ జట్లకు కీలకమైన చివరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేటి ఉదయం ప్రారంభమైంది. ఈ టెస్టులోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. అయినా ఎట్టకేలకు పర్యాటక ఇంగ్లీష్ జట్టు స్కోరు 100 దాటింది.
తొలుత టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన నాలుగో టెస్టులోనూ అక్షర్ పటేల్ టీమిండియా(Team India)కు శుభారంభాన్ని ఇచ్చాడు. తాను వేసిన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 6వ ఓవర్)లో ఇంగ్లాండ్ ఓపెనర్ సిబ్లీ(2)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికి ఆ జట్టు 10 పరుగుల వద్ద ఉంది. ఆపై మరోసారి అక్షర్ పటేల్ పర్యాటక జట్టును దెబ్బతీశాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే(9)ని పెవిలియన్ బాట పట్టించాడు.
Also Read: Kieron Pollard 6 Sixes Video: యువరాజ్ సింగ్ తరహాలో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన కీరన్ పోలార్డ్
క్రాలే షాట్ ఆడగా టీమిండియా ఫీల్డర్ మహ్మద్ సిరాజ్ క్యాచ్ అందుకోవడంతో నిరాశగా పెవిలిన్ చేరాడు. కీలకమైన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వికెట్ మహ్మద్ సిరాజ్ పడగొట్టాడు. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు రూట్. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్, బెయిర్ స్టో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అక్షర్ పటేల్(Axar Patel), సిరాజ్ తమ బౌలింగ్ దాడి కొనసాగిస్తున్నారు.
లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది ఇంగ్లాండ్. లంచ్ తర్వాత సిరాజ్ మరో కీలక వికెట్ పడగొట్టాడు. జానీ బెయిర్ స్టో(28)ని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. అయితే ఓలీ పోప్(9), బెన్ స్టోక్స్(40) నిలకడగా ఆడటంతో ఇంగ్లాండ్ జట్టు 100 పరుగులు దాటింది. 114 బంతుల్లో టెస్టుల్లో 24వ హాఫ్ సెంచరీని బెన్ స్టోక్స్ సాధించాడు. 44 ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook