Jasprit Bumrah Marriage: పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా, BCCIకి సమాచారంతో విశ్రాంతి

Jasprit Bumrah Wife Name కోసం టీమిండియా ప్రేక్షకులు, క్రికెట్ ప్రేమికులు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా పెళ్లి ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 3, 2021, 12:36 PM IST
Jasprit Bumrah Marriage: పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా, BCCIకి సమాచారంతో విశ్రాంతి

Jasprit Bumrah Marriage: ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఎందుకు దూరం కానున్నాడో తెలిసింది. అదే కారణంగానే ఇంగ్లాండ్‌తో జరగాల్సిన 5 టీ20ల సిరీస్‌కు పేసర్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. జస్ప్రిత్ బుమ్రా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. అందుకోసమే తాజాగా జరగనున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐకి సమాచారం అందించటనట్లు తెలుస్తోంది. 

మరోవైపు టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1తో ఇంగ్లాండ్‌పై ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం(మార్చి 4) నుంచి విరాట్ కోహ్లీ సేన అహ్మదాబాద్ వేదికగా చివరిదైన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బుమ్రాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) విశ్రాంతి కల్పించింది. వరుస సిరీస్ మ్యాచ్‌ల నుంచి కీలక పేసర్ జస్ప్రిత్ బుమ్రా తప్పుకోవడంతో అసలు కారణం బయటకొచ్చింది. జస్ప్రిత్ బుమ్రా పెళ్లి(Jasprit Bumrah Marriage) పనుల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడని కథనాలు వస్తున్నాయి.

Also Read: Dhanashree Verma Photos: మాల్దీవులలో భార్యతో టీమిండియా స్పిన్నర్ Yuzvendra Chahal, వైరల్ అవుతున్న ఫొటోషూట్

తన వివాహం విషయాన్ని బీసీసీఐ అధికారులకు వెల్లడించి, పెళ్లికి ఏర్పాట్ల కోసం తనకు విశ్రాంతి కావాలని కోరినట్లు జాతీయ మీడియా ఏఎన్‌ఐ పేర్కొంది. 27 ఏళ్ల జస్ప్రిత్ బుమ్రా పెళ్లి పనులు, ఇతరత్రా వ్యక్తిగత పనుల నేపథ్యంలో తనకు కొన్ని రోజులు విశ్రాంతి కోరగా బీసీసీఐ అందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే పెళ్లి తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 (IPL 2021) వరకు బుమ్రా సిద్ధంగా ఉండవచ్చు. ముంబై ఇండియన్స్ కచ్చితంగా బుమ్రా సేవల్ని కోరుకుంటుందని తెలిసిందే.

Also Read: Team India: ఇంగ్లాడ్‌తో నాలుగో టెస్టుకు, వన్డే సిరీస్‌కు టీమిండియా పేసర్ Jasprit Bumrah దూరం

గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో టీమిండియా క్రికెటర్లు విజయ్ శంకర్, యుజువేంద్ర చాహల్ సహా వరుణ్ చక్రవర్తి పెళ్లిపీటలు ఎక్కారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా వీరి బాటలో జస్ప్రిత్ బుమ్రా నడవనున్నాడని క్రికెట్ ప్రేమికులు చెబుతున్నారు. అయితే బుమ్రా ఎలాంటి అధికారిక ప్రకటనగానీ, పోస్ట్ గానీ చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

Also Read: EPFO Interest Rates: 6 కోట్ల మంది EPF ఖాతాదారులకు షాక్, వడ్డీ రేట్లుపై ఎంతమేర కోత విధిస్తారో 

కాగా, తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి  విఫలం అయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి చెందిన ఓ అధికారి వెల్లడించారు. కానీ తమిళనాడు స్పిన్నర్ ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయితే టీ20 సిరీస్‌లో జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. టీ20 సిరీస్‌కు మరో 10 రోజులు ఉన్నందున ఈ గడువులోగా మరోసారి వరుణ్ చక్రవర్తితో పాటు ఆ ఆటగాడికి మరోసారి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. 

Also Read: Hardik Pandya: భార్య Natasa Stankovic‌తో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫొటోషూట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News