India vs England 3rd Test Highlights: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచంలోని అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో విరాట్ కోహ్లీ సేన విజయం సాధించిడంతో పాటు పలు రికార్డులను తిరగరాసింది.
స్వదేశంలో అత్యుత్తమ భారత కెప్టెన్‌గా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నిలిచాడు. ధోనీ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 30 మ్యాచ్‌లలో 21 విజయాలు సాధించగా, భారత గడ్డపై విరాట్ కోహ్లీ(Virat Kohli) టీమిండియాకు 22 విజయాలు అందించాడు.
Also Read: R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు
రవిచంద్రన్ అశ్విన్ 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత నమోదు చేసిన నాలుగో భారత బౌలర్ అశ్విన్ కాగా, మురళీధరన్ తరువాత అత్యంత వేగవంతంగా ఈ టెస్టు కెరీర్‌లో 400 వికెట్లు పడగొట్టిన బౌలర్ అయ్యాడు. కేవలం 77వ టెస్టులో ఈ ఫీట్ నమోదు చేశాడు అశ్విన్(R Ashwin).
డే అండ్ టెస్టులో స్పిన్నర్లు అత్యధిక వికెట్లతో రికార్డులు తిరగరాశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీమిండియా స్పిన్నర్లు కలిపి మొత్తం 27 వికెట్లు పడగొట్టారు. గతంలో పాక్, శ్రీలంక టెస్టు మ్యాచ్‌లో 24 మ్యాచ్‌లు, పాక్, వెస్టిండీస్ టెస్టులో 22 వికెట్లను స్పిన్నర్లు సాధించారు.
Also Read: Martin Guptill వీర విహారం, Rohit Sharma అత్యధిక సిక్సర్ల రికార్డు బద్ధలు
అక్షర్ పటేల్ ఆడుతున్న రెండో టెస్టులోనే 10+ వికెట్లను పడగొట్టి అద్భుతం చేశాడు. మొతేరా వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో టీమిండియా(Team India) 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి బంతికే వికెట్ తీసిన నాలుగో బౌలర్‌గా టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ నిలిచాడు. గతంలో ముగ్గురు బౌలర్లు ఈ ఫీట్ నమోదు చేయగా, మోతెరా టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో తొలి బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ వికెట్ తీశాడు.
Also Read: Glenn maxwell and vini raman నిశ్చితార్ధానికి ఏడాది..వైరల్ అవుతున్న నిశ్చితార్ధం ఫోటోలు
ఇంగ్లాడ్ జట్టు టీమిండియాతో మ్యాచ్‌లో అత్యల్పి స్కోర్లు చేసిన టెస్టు మ్యాచ్ ఇది. తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్, అశ్విన్ బౌలింగ్ దాటికి 112 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 81 పరుగులకే ఆలౌట్ అయ్యారు. టీమిండియాపై ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
కేవలం రెండురోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసింది. మరోవైపు అదే టెస్టులో ఒక్క వికెట్ సైతం కోల్పోకుండా టీమిండియా తొలిసారిగా విజయం సాధించింది. అందులోనూ ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ జరిగింది.
టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ సిరీస్‌లో అత్యుత్తమ గణాంకాల పరంపర కొనసాగుతోంది. తొలి టెస్టులోనే 5 వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగిన అక్షర్ పటేల్, రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అయిదేసి వికెట్లు సాధించాడు.
డే అండ్ నైట్ టెస్టులో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్, అత్యధికంగా 11 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు. కేవలం 70 పరుగులు ఇచ్చి 11 వికెట్లు తీయడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook