Akash Deep No Ball: ఇదేందయ్యా.. ఆకాశ్ దీప్ ఫస్ట్ వికెట్‌కే ఇలా జరిగింది.. అంపైర్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!
India Vs England 4th Test Updates: టెస్ట్ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు యంగ్ బౌలర్ ఆకాశ్ దీప్. తొలి స్పెల్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను చావుదెబ్బ తీశాడు. నాలుగో ఓవర్లోనే ఓపెనర్ బెన్ డకెట్‌ను క్లీన్ బౌల్డ్ చేసి తొలి వికెట్ దక్కించుకున్నాడు. అయితే అది నోబాల్ అంటూ అంపైర్ ప్రకటించడంతో నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
India Vs England 4th Test Updates: రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. మూడు వికెట్లు తీసి.. టెస్ట్ కెరీర్ అద్భుతంగా ఆరంభించాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టెస్టు నుంచి మేనేజ్‌మెంట్ విశ్రాంతినివ్వడంతో ఆకాష్ దీప్‌కి అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని ఈ యంగ్ పేసర్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఇక మ్యాచ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది.
తొలి మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్ దీప్.. నాల్గో ఓవర్ ఐదో బంతికే బెన్ డకెట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తనకు తొలి వికెట్ దక్కడంతో ఆకాశ్‌తోపాటు టీమ్ సభ్యులు కూడా భారీగా సంబరాలు చేసుకున్నారు. అయితే కాసేపటికే నోబాల్ సైరన్ మోగడంతో ఆకాశ్ నిరూత్సాహానకి గురయ్యాడు. ఇలా తొలి వికెట్ దక్కినా.. నోబాల్ కావడంతో కాస్త నిరాశకు గురైనా ఆ తరువాత చెలరేగాడు. 10వ ఓవర్‌లో తొలి వికెట్‌ను అందుకున్నాడు. ఆకాశ్ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని బెన్ డకెట్ బ్యాట్ ఎడ్జ్‌కు తాకగా.. వికెట్ కీపర్ ధృవ్ జురెల్ సింపుల్ క్యాచ్ పట్టాడు. తొలి వికెట్ దక్కడంతో ఆకాష్ మరోసారి సంబరాలు చేసుకున్నాడు.
అదే ఓవర్‌లో ఆలీ పోప్‌ను డకౌట్ చేశాడు. ఆకాశ్ వేసిన లెంగ్త్ బాల్.. నేరుగా పోప్ ప్యాడ్స్‌ను తాకింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో ఔట్‌గా తేలడంతో పోప్ పెవిలియన్ బాటపట్టాడు. 12వ ఓవర్‌లో మరోసారి బ్రేక్ అందించాడు ఆకాశ్. క్రీజ్‌లో కుదురుకుంటున్న ఓపెనర్ క్రాలీ (42)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తరువాత దూకుడుగా ఆడుతున్న జానీ బెయిర్ స్టో (38)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపించాడు. కాసేపటికే కెప్టెన్ బెయిర్ స్టో (3)ను రవీంద్ర జడేజా ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
జో రూట్, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వికెట్ల పతనానికి అడ్డుకట్టవేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 180 పరుగులుగా ఉంది. జోరూట్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. బెన్ ఫోక్స్ 23 పరుగుల వద్ద ఆడుతున్నాడు. ఆకాశ్ దీప్ 3, అశ్విన్, జడేజా చెరో వికెట్ తీశారు.
Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్, ధర పరంగా ఇదే బెస్ట్!
Also Read: Movies Postponed: 'వ్యూహం, శపథం' మళ్లీ వాయిదా.. నారా లోకేశ్‌కు ఆర్జీవీ అదిరిపోయే పంచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి