IND vs ENG: నేటి నుంచి ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లీష్‌ జట్టు సమం చేసింది. ఇటు భారత జట్టు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. సూర్యకుమార్‌ అద్భుత సెంచరీ చేసి జట్టును గెలిపించేందుకు ఆఖరు వరకు పోరాడాడు. ఐతే ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు వన్డే సిరీస్ వచ్చింది. టీ20 సిరీస్‌ కైవసం చేసుకుని భారత్ రెట్టింపు ఉత్సాహంతో ఉంది. చివరి మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్‌ అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని చూస్తోంది. మొత్తంగా ఈసిరీస్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఐతే ఈమ్యాచ్‌లో కోహ్లీ ఆడకపోవచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. మొన్నటి మ్యాచ్‌లో కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తోంది.


ఓవల్ పిచ్ బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్లకు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో టీమిండియాదే పైచేయి ఉంది. 103 మ్యాచ్‌ల్లో భారత్ 55 సార్లు గెలిచించింది. 


టీమిండియా టీమ్..


రోహిత్(కెప్టెన్), ధావన్, కోహ్లీ/శ్రేయస్,సూర్యకుమార్‌ యాదవ్, పంత్, పాండ్యా, జడేజా, బుమ్రా, షమీ, ప్రసిద్ద్/శార్దూల్, చాహల్.


ఇంగ్లండ్ జట్టు..


రాయ్, బెయిర్‌స్టో, లివింగ్ స్టోన్, స్టోక్స్, బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, కరన్, విల్లీ, టాప్లీ, పార్కిన్సన్.


Also read:Ashu Reddy: బీచ్ సైడ్ పార్టీలో పొట్టి బట్టల్లో అషు రెడ్డి రచ్చ.. నెవర్ బిఫోర్ అనేలా!


Also read:SI Physical Abuse: మరో ఖాకీ కీచకపర్వం.. ఆసిఫాబాద్ జిల్లాలో యువతికి ఎస్సై లైంగిక వేధింపులు..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook