న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా పర్యటన రేపట్నించి అంటే నవంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఈ టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్నాడు. సీనియర్లు లేకుండానే న్యుజిలాండ్ పర్యటన సాగనుండటం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్‌లో ఇండియా తరపున ఓపెనింగ్ ఎవరనేది సమస్యగా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయించలేని పరిస్థితి. ఎందుకంటే ఓపెనింగ్ రేసులో ఇప్పుడు ఒకరు కాదు..ఐదుగురున్నారు.


న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియాకు శుభమన్ గిల్ ఓపెన్ చేసే అవకాశాలున్నాయి. శుభమన్ గిల్ గతంలో టీమ్ ఇండియా తరపున అద్బుత ప్రతిభ కనబర్చాడు. ఐపీఎల్‌లో కూడా పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ తరపున మంచి ఇన్నింగ్స్ ఆడాడు.


రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లేకుండానే టీమ్ ఇండియా పర్యటన  సాగనుంది. ఇప్పుడు శుభమన్ గిల్‌‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌కు దిగవచ్చని తెలుస్తోంది. గత ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ ఇప్పుడు టీమ్ ఇండియా తరపున ఓపెనింగ్ రేసులో ఉన్నాడు. ఇక ఓపెనింగ్ రేసులో ఉన్న మరో వ్యక్తి రిషభ్ పంత్. న్యూజిలాండ్ పర్యటనలో రిషభ్ పంత్ ఇప్పుడు ఓపెనింగ్ రేసులో ఉన్నాడు. అయితే రిషభ్ పంత్ గతంలో ఎప్పుడూ ఓపెనర్‌గా సక్సెస్ కాలేదనే విమర్శ కూడా ఉంది. 


వికెట్ కీపర్, బ్యాటర్‌గా రాణిస్తున్న సంజూ శామ్సన్ కూడా ఓపెనింగ్‌కు మరో ఆప్షన్‌గా కన్పిస్తున్నాడు. సంజూ శామ్సన్‌కు ఐపీఎల్‌లో ఓపెనర్‌గా చాలా ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవముంది. ఇక మరో బ్యాటర్ దీపక్ హుడా. ఓపెనింగ్‌కు ఇతడు కూడా మంచి ప్రత్యామ్నాయమే. టీ20లో ఓ సెంచరీ కూడా నమోదు చేశాడు. 


Also read: Babar Azam: టీ20 ప్రపంచ కప్‌లో పాక్ ఓటమి.. బాబర్ ఆజామ్ సోదరుడికి నోటీసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook