AB de Villiers says Virat Kohli remains world class: ఆసియా కప్‌ 2022, టీ20 ప్రపంచకప్‌ 2022 లాంటి మేజర్ టోర్నీలు మరికొన్ని రోజుల్లో ఉన్నాయి. ఈ రెండు టోర్నీలు భారత్ గెలవాలంటే.. మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫామ్‌ అందుకోవాల్సిందే. గత మూడేళ్లుగా కోహ్లీ తన స్థాయి ప్రదర్శన చెయ్యట్లేదు. కింగ్ సెంచరీ చేసి 1000 రోజులు కూడా పూర్తయ్యాయి. దాంతో కోహ్లీ ఫామ్‌పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. దిగ్గజాలు అందరూ తమ తమ అభిప్రాయాలు చెపుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ తాజాగా విరాట్ ఫామ్‌పై స్పందించాడు. కోహ్లీ ఎప్పటికీ వరల్డ్‌ క్లాస్‌ ఆటగాడే అని అన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏబీ డివిలియర్స్‌ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. ఫామ్‌ కోల్పోవడం అనేది ఏ ఆటాడికైనా సహజం. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. క్లాస్‌ ఆట శాశ్వతం. కోహ్లీ ప్రపంచ స్థాయి క్లాస్‌ ఆటగాడు. కోహ్లీ ఎప్పటికీ వరల్డ్‌ క్లాస్‌ ఆటగాడే. నేను అతడితో రెగ్యులర్‌గా మాట్లాడుతుంటా. మేమిద్దరం మంచి స్నేహితులం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీకి నా అవసరం ఉండదు. అతడు తప్పకుండా ఫామ్‌ అందుకుంటాడు' అని అన్నాడు. 


'టీ20 క్రికెట్‌ లీగ్‌లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంటుంది. అయితే వన్డే, టెస్ట్ ఫార్మాట్లపై టీ20ల ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు బోర్డులు తగినంత సమయం ఇస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌ను వృద్ధి చేయడంలో అంతర్జాతీయంగా ఫ్రాంచైజీలు కీలక పాత్ర పోషిస్తాయి' అని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్‌ పేర్కొన్నాడు. ఆసియా కప్ 2022 ఆగష్టు 27న ఆరంభం కానుంది. ఇక 28న పాకిస్థాన్‌, భారత్ జట్లు తలపడనున్నాయి. 


Also Read: Shraddha Das Images: శ్రద్ధా దాస్ హాట్ క్లీవేజ్ షో.. అమ్మడిని ఇలా ఎప్పుడూ చూసుండరు!


Also Read: Belly Fat: బెల్లీ ప్యాట్‌తో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే 7 రోజుల్లో సులభంగా కరిగిపోతుంది..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి