Asia Cup 2022: భారత్‌పై పాకిస్తాన్‌దే విజయం.. సర్ఫరాజ్ అహ్మద్ జోస్యం!
Sarfaraz Ahmed says Pakistan beat India. హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ మళ్లీ విజయం సాధిస్తుందని సర్ఫరాజ్ అహ్మద్ జోస్యం చెప్పాడు.
Sarfaraz Ahmed says Pakistan beat India in Asia Cup 2022 Clash: ఆసియా కప్ 2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. మరో 8 రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. 28న దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ జట్లు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండో-పాక్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతుండడంతో.. ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌పై మాజీలు అందరూ తమతమ అభిప్రాయాలు చెపుతున్నారు. తాజాగా పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా తన అభిప్రాయం చెప్పాడు.
ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ మళ్లీ విజయం సాధిస్తుందని సర్ఫరాజ్ అహ్మద్ జోస్యం చెప్పాడు. స్పోర్ట్స్ పాక్ టీవీ ఇంటరాక్షన్‌లో సర్ఫరాజ్ మాట్లాడుతూ... 'ప్రపంచకప్, ఆసియా కప్ లాంటి మెగా టోర్నీల్లో ఏ జట్టు అయినా తొలి మ్యాచ్‌ను విజయంతో ప్రారంభించాలని చూస్తుంది. ఆసియా కప్‌లో భాగంగా పాక్ తొలి మ్యాచ్‌లో టీమిండియాను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో మా జట్టు పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగనుంది. మేము గతేడాది ఇదే వేదికపై భారత్‌ను ఓడించాం' అని అన్నాడు.
'యూఏఈలో పరిస్ధితులు పాకిస్తాన్ జట్టుకు బాగా తెలుసు. గతంలో మేము ఇక్కడ పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు పలు ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడాం. కాబట్టి ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కచ్చితంగా విజయం సాధిస్తుంది. మరోవైపు భారత ఆటగాళ్లకు కూడా యూఏఈలో ఐపీఎల్ మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. అయితే టీమిండియా కంటే.. పాక్ జట్టుకే యూఏఈ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువ ఉంది. కచ్చితంగా టీమిండియాపై భారత్ గెలుస్తుంది' అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.
Also Read: Bangladesh Coach: బంగ్లాదేశ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్.. ప్రధాన టార్గెట్ అదేనట!
Also Read: Raashi Khanna Hot Photos: మునుపెన్నడూ లేనివిధంగా రెచ్చిపోయిన రాశి ఖన్నా.. నెవర్ బిఫోర్ అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook