Bangladesh Coach: బంగ్లాదేశ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌.. ప్రధాన టార్గెట్ అదేనట!

Sridharan Sriram Appointed as Bangladesh Coach For T20 World Cup 2022. ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ 2022 టోర్నీ కోసం భారత మాజీ క్రికెటర్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ను బంగ్లాదేశ్‌ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 19, 2022, 05:33 PM IST
  • బంగ్లాదేశ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌
  • ప్రధాన టార్గెట్ అదేనట
  • అన్ని జట్లకు గట్టి పోటీ ఇస్తాం
Bangladesh Coach: బంగ్లాదేశ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌.. ప్రధాన టార్గెట్ అదేనట!

Sridharan Sriram Appointed as Bangladesh Coach For Asia Cup 2022: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ 2022, టీ20 ప్రపంచకప్‌ 2022 టోర్నీల కోసం భారత మాజీ క్రికెటర్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని ది డైలీ స్టార్‌ తన కథనంలో పేర్కొంది. బంగ్లా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచకప్‌ గెలవడమే అట. ఆసియా కప్‌ 2022 ఆగష్టు 27న ఆరంభం కానుంది. తొలి మ్యాచులో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లు తలపడనున్నాయి. 

బంగ్లాదేశ్‌ బోర్డు అధికారి మాట్లాడుతూ... 'ఆసియా కప్‌ 2022, ప్రపంచకప్‌ 2022 ఈవెంట్‌ల వరకు బంగ్లాదేశ్‌ జట్టు శ్రీధరన్‌ శ్రీరామ్‌తో కలిసి పనిచేయబోతున్నాం. ఆసియా కప్‌ 2022 నుంచి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచకప్‌. అన్ని జట్లకు గట్టి పోటీ ఇస్తాం. ప్రపంచకప్‌ టోర్నీ సమయంలో ఈ నియామకం జరిగినట్లయితే.. అప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని జట్టుతో మమేకమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే ఆసియా కప్‌ ఈవెంట్‌ నుంచే జట్టుతో కలిసేలా ప్రణాళికలు వేశాం' అని తెలిపాడు. 

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు శ్రీధరన్‌ శ్రీరామ్‌ నియామకం నేపథ్యంలో.. ప్రస్తుత కోచ్‌ రసెల్‌ డొమింగో బంగ్లాదేశ్‌ టెస్టు జట్టుకు మార్గదర్శనం చేయన్నాడు. చెన్నైకి చెందిన శ్రీరామ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌. 2000-2004 మధ్య కాలంలో భారత్ తరఫున ఎనిమిది వన్డేలు ఆడిన శ్రీరామ్‌.. కోచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ముందుగా ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించి అష్టన్‌ అగర్‌, ఆడం జంపా లాంటి యువకులకు స్పిన్‌ బౌలింగ్‌లో మెళకువలు నేర్పించాడు. టీ20 ప్రపంచకప్‌ 2021 గెలిచిన ఆసీస్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా కూడా పని చేశాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కోచింగ్‌ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు.

Also Read: ‘సునీల్-సుడిగాలి సుధీర్-అనసూయ’లు నటించిన ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ రివ్యూ

Also Read: Viral Video: ముంబైలో కళ్ల ముందే కూలిన భవనం..స్థానికుల పరుగులు..వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News