Ind vs SA 1st ODI 2022 Match: సంజూ శాంసన్ వీరోచిత పోరాటం వృథా.. తొలి వన్డేలో సౌతాఫ్రికా విజయం
Ind vs SA 1st ODI 2022 Match: లక్నో స్టేడియంలో సౌతాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Ind vs SA 1st ODI 2022 Match: తొలి మ్యాచ్‌లోనే గెలిచిన సౌతాఫ్రికా 1-0 తేడాతో సిరీస్‌లో పైచేయి సాధించింది. టీమిండియా తరపున సంజూ శాంసన్ చేసిన వీరోచిత పోరాటం సౌతాఫ్రికా గెలుపుతో వృథా అయ్యింది. సౌతాఫ్రికా vs టీమిండియా మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టేన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకోవడంతో సౌతాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అవడంతో 50 ఓవర్ల మ్యాచ్ ని 40 ఓవర్లకు కుదించారు. ఆరంభంలో శార్థుల్ థాకూర్ సౌతాఫ్రికా ఆటగాళ్లను ఇబ్బందిపెట్టడంతో ఆ జట్టు బ్యాటింగ్ కూడా నెమ్మదించింది. డేవిడ్ మిల్లర్ 75 పరుగులు (63 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు), హిన్రిచ్ క్లాసెన్ 74 పరుగులు (65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు), క్వింటన్ డి కాక్ 48 పరుగులు (54 బంతుల్లో 5 ఫోర్లు) శ్రమించడంతో నిర్ణీత 40 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమై దారుణంగా విఫలమయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (19), ఇషాన్ కిషన్ (20) కూడా నెమ్మదించారు. శ్రేయాస్ అయ్యర్ చేసిన హాఫ్ సెంచరీతో (37 బంతుల్లో 8 ఫోర్లు) మ్యాచ్ ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. శార్థుల్ థాకూర్ 33 పరుగులతో పాటు సంజూ శాంసన్ 86 పరుగులతో (63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు) చేసిన వీరోచిత పోరాటం వృథా అయ్యాయి. నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి టీమిండియా 240 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియాకు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తప్పలేదు.
టీమిండియా బౌలర్లలో శార్థూల్ థాకూర్ 2/23 తో రాణించగా.. రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3/52 , కగిసో రబడ 2/36 తో ప్రూవ్ చేసుకోగా.. వేన్ పర్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ శంశి చెరో వికెట్ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ హెయిన్‌రిచ్ క్లాసెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కించుకున్నాడు.
Also Read : Sandeep Lamichhane Arrest: అత్యాచార ఆరోపణలు.. స్టార్ క్రికెటర్ అరెస్ట్!
Also Read : ఆ పేసర్ టీ20 ప్రపంచకప్ భారత జట్టులో లేకపోవడంతో షాక్ అయ్యా: బ్రెట్ లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి