ఆ అవకాశం నాకు వస్తే.. ఎంఎస్ ధోనీ బుర్రలో ఏముందో చదువుతా: కార్తీక్
IND vs SA 2nd T20I, Dinesh Karthik about MS Dhoni mind. ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైండ్‌ను చదువుతా అని దినేశ్ కార్తీక్ బదులిచ్చాడు.
Dinesh Karthik says I Will read MS Dhoni's mind: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ పని ఇక అయిపోయిందని అనుకున్న తరుణంలో భారత జట్టులోకి గొప్పగా పురాగమనం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌లలో 55 సగటు, 83.33 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022లో కీపర్, బ్యాటర్‌గా రాణించడంతో దక్షిణఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
దక్షిణఫ్రికాతో రెండో టీ20కి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసిన ఓ వీడియోలో దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. డీకేని పలు ప్రశ్నలు అడగ్గా.. సరదాగా సమాధానాలిచ్చాడు. మీకు ఎగిరిపోవడం ఇష్టమా? లేక ఎవరిదైనా బుర్ర చదవడం ఇష్టమా? అని అడగ్గా.. 'నాకు ఎగిరిపోయే అవకాశం వస్తే అలస్కా (అమెరికా) వెళ్లిపోతా. ఆ ప్రాంతం గురించి చాలా విషయాలు విన్నాను. ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైండ్‌ను చదువుతా' అని డీకే బదులిచ్చాడు.
టీ ఇష్టమా? లేదంటే కాఫీనా? అని అడిగితే.. తనకు టీ అంటేనే చాలా ఇష్టమని, భారత దేశంలో ఎక్కడకు వెళ్లినా కూడా మంచి టీ సులభంగా దొరుకుతుందని దినేశ్ కార్తీక్ చెప్పాడు. జట్టుతో డిన్నర్ చేయడం ఇష్టమా? సినిమాకు వెళ్లడం ఇష్టమా? అని అడిగితే.. టీమ్ డిన్నర్ అంటేనే ఇష్టమని, ఆటగాళ్లతో భోజనం చేయడం చాలా బాగుంటుందన్నాడు. ఏదైనా పార్టీలో పాడటం ఇష్టమా? లేక డాన్స్ చేయడం ఇష్టమా? అడగ్గా.. చాలా కష్టమైన ప్రశ్న అని, తాను రెండింటిలో ఏదీ చేయలేను అని డీకే చెప్పాడు.
తనకు టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ అంటే చాలా ఇష్టమని, ఫుట్‌బాల్‌లో లియోనియల్ మెస్సీ ఆటతీరు బాగా నచ్చుతుందని దినేశ్ కార్తీక్ చెప్పాడు. తన జీవితంపై పుస్తకం కన్నా.. సినిమా వస్తే బాగుంటుందన్నాడు. వంట చేయడం కంటే.. ఇంటిని శుభ్రం చేయడానికే తాను ప్రాధాన్యతనిస్తానన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ కంటే ట్విటర్‌కే డీకే ఓటేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డీకేకు.. తొలి టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. కేవలం రెండు బంతులే ఎదుర్కున్నాడు. బారాబటి స్టేడియంలో జరిగే రెండో టీ20 కోసం డీకే సన్నద్ధం అవుతున్నాడు.
Also Read: Anushka Sharma: పెళ్లయినా తగ్గేదేలే.. స్విమ్ సూట్ ధరించి అనుష్క శర్మ సెల్ఫీలు!
Also Read: Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాల రాకకు వేళాయే..ఇక భారీ వర్షాలే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.