Anushka Sharma: పెళ్లయినా తగ్గేదేలే.. స్విమ్ సూట్ ధరించి అనుష్క శర్మ సెల్ఫీలు!

Anushka Sharma looks hot in orange tangerine swimsuit. వేసవి కావడంతో మాల్దీవులోని బీచ్‌లో అనుష్క శర్మ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్ సూట్‌తో పాటు తలకు టోపీ కూడా పెట్టుకుని బీచ్‌లో హల్చల్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 04:54 PM IST
  • బ్రేక్ తీసుకున్న అనుష్క
  • స్విమ్ సూట్ ధరించి అనుష్క సెల్ఫీలు
  • పెళ్లయినా తగ్గేదేలే
Anushka Sharma: పెళ్లయినా తగ్గేదేలే.. స్విమ్ సూట్ ధరించి అనుష్క శర్మ సెల్ఫీలు!

Virat Kohli wife Anushka Sharma looks hot in orange tangerine swimsuit: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరు. 2008లో వచ్చిన 'రబ్ నే బనాది జోడీ' సినిమాతో సినీ ప్రేక్షకులకు అనుష్క పరిచయం అయ్యారు. ఆ సినిమా భారీ హిట్ కొట్టడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే అమీర్ ఖాన్, షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్‌తో కలిసి సినిమాలు చేశారు. బద్మాష్ కంపెనీ, బ్యాండ్ బాజా భారత్, పీకే, బాంబే వెల్వెట్, సుల్తాన్, పారి, సంజు, జీరో లాంటి హిట్ సినిమాల్లో అనుష్క నటించారు.  

కెరీర్ మంచి ఊపులో ఉండగానే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుష్క శర్మ. వివాహం అనంతరం అనుష్క పూర్తిగా సినిమాలు చేయడం మానేశారు. పూర్తి సమయం కోహ్లీతోనే గడిపారు. కోహ్లీ, అనుష్క జంటకు వామికా అనే చిన్నారి కూడా ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌తో అరకొర సినిమాలు చేస్తుంది అనుష్క.. కోహ్లీతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ షో ‘చక్ దా ఎక్స్ ప్రెస్’ నుంచి బ్రేక్ తీసుకున్న అనుష్క.. భర్తతో మాల్దీవుల పర్యటనకు వెళ్లారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

వేసవి కావడంతో మాల్దీవులోని బీచ్‌లో అనుష్క శర్మ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్ సూట్‌తో పాటు తలకు టోపీ కూడా పెట్టుకుని బీచ్‌లో హల్చల్ చేశారు. ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ వేసుకుని తనను తానే ఫొటోలు తీసుకున్నారు. ఆ పోటోలను వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'మీ ఫొటోలను మీరే తీసుకుంటే.. వచ్చే రిసల్ట్ ఇది' అని అనుష్క క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లయినా తగ్గేదేలే, అనుష్క చాలా హాట్ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: IND vs SA 2nd T20I: రెండో టీ20కి వ‌రుణుడి ముప్పు.. 50% వ‌ర్షం ప‌డే ఛాన్స్‌!

Also Read: Pitradosh: పితృ దోషం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News