IND vs SA 2nd T20I Playing 11 is Out: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మరోకొద్ధి సేపట్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ స్థానాల్లో హెన్రిచ్ క్లాసెన్, రీజా హెండ్రిక్స్ జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చేతికి గాయం కావడంతో రెండో టీ20లో క్వింటన్ డీకాక్ ఆడటం లేదని, ట్రిస్టియన్ స్టబ్స్ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని టాస్ సందర్భంగా తెంబా బావుమా తెలిపాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ చెప్పాడు. తాము గత మ్యాచ్‌లో ఎలాంటి తప్పూ చేయలేదని, ఎగ్జిక్యూషన్ మాత్రం మెరుగైతే చాలన్నాడు. దాంతో జట్టులో చోటు ఆశించిన ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లకు నిరాశే ఎదురైంది. 


రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూశాడు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో రెండో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. కటక్‌లోని బారాబటి స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది. 



తుది జట్లు:
భారత్
: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చహల్, ఆవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్. 
దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రాసీ వాన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వెయిన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, ఆన్రిచ్ నోర్జ్, తబ్రయిజ్ షంసీ. 


Also Read: ఆ అవకాశం నాకు వస్తే.. ఎంఎస్ ధోనీ బుర్రలో ఏముందో చదువుతా: కార్తీక్


Also Read: Anushka Sharma: పెళ్లయినా తగ్గేదేలే.. స్విమ్ సూట్ ధరించి అనుష్క శర్మ సెల్ఫీలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.