IND vs SA: దేవుడా.. నువ్ ఉన్నావ్! టీమిండియాను కాపాడు! నాలుగో రోజు ఆటపై పేలుతున్న జోకులు!!
జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడంతో టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IND vs SA 2nd Test start delayed due to Rain: మూడు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా జోహన్నెస్‌బర్గ్ (Johannesburg) వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. జొహనెస్‌బర్గ్‌లో వర్షం (Rain) కురుస్తుండటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో నాలుగో రోజు ఆట ఇంకా ఆరంభం (Play Start Delayed Due To Rain) కాలేదు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ తన ట్విట్టర్ ఖాతాలో అక్కడి వాతావరణం గురించి ఓ పోస్ట్ చేసింది. 'ప్రతికూల వాతావరణం కారణంగా రెండో టెస్ట్ 4వ రోజు ఆట ఆలస్యం కానుంది' అని ట్వీట్ చేసింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 118/2 స్కోరుతో నిలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా (South Africa) విజయానికి ఇంకా 122 పరుగులు కావాలి. కెప్టెన్ డీన్ ఎల్గర్ (46), స్టార్ బ్యాటర్ రాస్సి వాండర్ డస్సెన్ (11) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు క్రీజులో నిలదొక్కుకుంటే ప్రొటీస్ జట్టుకు విజయం సులువే. మరోవైపు భారత్ (India) విజయానికి ఎనిమిది వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టెస్ట్ గెలవడానికి దక్షిణాఫ్రికాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భారత బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తే తప్ప ప్రొటీస్ విజయం లాంఛనమే.
Also Read: కోరిక తీర్చాలని కోడలికి వేధింపులు... విషయం బయటకు పొక్కడంతో దారుణానికి ఒడిగట్టిన మామ...
నాలుగో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడంతో భారత అభిమానులు (Indian Cricket Fans) ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జోహన్నెస్‌బర్గ్ పరిస్థితులను చూస్తుంటే.. మొదటి సెషన్ ఆట కోల్పోయినట్టే. మరోసారి వర్షం వస్తే.. నాలుగో రోజు ఆట దాదాపుగా ఆసాద్యమే. దాంతో ఇండియన్ ఫాన్స్ సోషల్ మీడియాలో సరదా కామెంట్లు , మీమ్స్ (Memes) పోస్ట్ చేస్తున్నారు. 'దేవుడా.. నువ్ ఉన్నావ్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'వర్షం ఇలాగే కురిపించి టీమిండియాను కాపాడు దేవుడా' అని ఇంకొకరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఐదవ రోజు ఉందని మర్చిపోవద్దు అని ట్వీట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.