Chetan Sharma feels Ruturaj Gaikwad will do wonders for Team India: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం 18 మందితో కూడిన భారత జట్టు (Team India)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్‌ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)కు భారత జట్టులో చోటుదక్కింది. ఈ సందర్భంగా గైక్వాడ్‌పై బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ (Chetan Sharma) ప్రశంసల వర్షం కురిపించారు. గైక్వాడ్‌ను ఎందుకు ఎంపిక చేశారో కూడా తెలిపారు. సీఎస్‌కే ఓపెనర్ గత రెండేళ్లుగా బాగా ఆడుతున్నాడని, జాతీయ జట్టు కోసం అద్భుతాలు చేస్తాడని చేతన్‌ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. గైక్వాడ్‌ తుది జట్టులో ఆడుతాడో లేదనే విషయం టీం మేనేజ్మెంట్ ఇష్టం అని పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చేతన్‌ శర్మ మాట్లాడుతూ.. 'రుతురాజ్‌ గైక్వాడ్‌ గత రెండేళ్లుగా నిలకడగా ఆడుతున్నాడు. ఇటీవలి దేశవాళీ మ్యాచుల్లో ప్రదర్శన ఆధారంగా సెలెక్షన్‌ కమిటీ గైక్వాడ్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే తుది జట్టులో గైక్వాడ్‌ ఉంటాడా..? లేదా..? అనే విషయం టీం మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది. అతడిని ఏ స్థానంలో పంపించాలి, అతడి అవసరం ఎక్కడ  ఉంటుందనేది కోఆర్డినేట్‌ చేసుకుంటాం. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన గైక్వాడ్‌ను ఇప్పుడు వన్డేలకు కూడా ఎంపిక చేశాం. వన్డేలు ఆడడానికి అతడు అర్హుడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ మంచి ప్రదర్శనే ఇస్తాడని ఆశిస్తున్నాం. జాతీయ జట్టు కోసం అద్భుతాలు చేస్తాడని సెలెక్టర్లు భావించారు' అని తెలిపారు. 


Also Read: Aadavallu Meeku Joharlu : ఫుల్‌ జోష్‌లో శర్వానంద్, రష్మిక.. న్యూ ఇయర్ విషెస్ చెప్పిన శర్వానంద్


రుతురాజ్‌ గైక్వాడ్ ఐపీఎల్‌ (IPL) 2021లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్ ఐపీఎల్‌ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై తరఫున ఓపెనర్‌గా దిగిన గైక్వాడ్.. టోర్నీలో 635 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. అనంతరం జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలోనూ దేములేపాడు. ఐదు మ్యాచుల్లో వరుస సెంచరీలతో 603 పరుగులు చేశాడు. 168 అత్యధిక స్కోరు. గత జులైలో లంకతో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా గైక్వాడ్ భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. అయితే  రెండు మ్యాచుల్లో 38 పరుగులే చేశాడు. 


Also Read: Bangarraju Teaser: ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే! నువ్ మన దేశానికే సర్పంచ్ కావాలె!!


భారత వన్డే జట్టు: 
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, శర్దూల్ ఠాకుర్, మొహ్మద్ సిరాజ్.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook