R Ashwin become 2nd Indian spinner after Anil Kumble to take a Test wicket in Johannesburg: మూడు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో టీమిండియా సీనియర్‌ ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ (R Ashwin) అరుదైన ఫీట్‌ అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్‌ పీటర్సన్‌ (Keegan Petersen)ను ఔట్‌ చేయడం ద్వారా భారత మాజీ స్పిన్‌ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) తర్వాత వాండరర్స్‌ మైదానంలో వికెట్‌ తీసిన రెండో భారత స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు. జోహన్నెస్‌బర్గ్ పిచ్ సహజంగా పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుంటుంది. ఇక్కడ స్పిన్నర్లు రాణిచేస్తే గోపా విషయం అని చూపొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో వాండరర్స్‌లో జరిగిన తొలి టెస్టులో అనిల్ కుంబ్లే రెండు ఇన్నింగ్స్‌లలో (2/2, 3/54) కలిపి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో భారత్ ఆ టెస్టులో 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి భారత జట్టు రెండు సార్లు (2013-14, 2017-18) దక్షిణాఫ్రికాలో పర్యటించింది. అయినా ఒక్క స్పిన్నర్ కూడా వాండరర్స్‌లో వికెట్ తీయలేదు. తాజా పర్యటనలో గత కొంత కాలంగా మంచి ఫామ్‌లో ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. 


Also Read: Mahesh Babu - Rashmika: మహిళా ప్రధాన పాత్రను ఎందుకు అగౌరవపరిచారు.. మహేష్ బాబుపై విమర్శల వర్షం!!


2021-22 పర్యటనలో భాగంగా వాండరర్స్‌ మైదానంలో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌.. కీగన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేశాడు. 3వ రోజు చివరి సెషన్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ను ఔట్ అవుట్ చేశాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్‌లో వికెట్ తీసిన భారత స్పిన్నర్‌గా అశ్విన్‌ అరుదైన రికార్డు ((R Ashwin Record) నెలకొల్పాడు. యాష్ ఇప్పటివరకు 83 టెస్టులు ఆడి 430 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ప్రదర్శన 30 సార్లు చేశాడు. ఇక బ్యాట్‌తో 2835 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండడం విశేషం. 


ఇక ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ (India)పై దక్షిణాఫ్రికా (South Africa) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 240 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు నాలుగోరోజు కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (96 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. ఇడెన్ మార్‌క్రమ్‌ (31), పీటర్సెన్‌ (28), డస్సెన్ (40), బవుమా( 23 నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ, ఠాకూర్‌, అశ్విన్‌ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా నాలుగో రోజు రెండు సెషన్ల పాటు ఆట రద్దైనా.. మూడో సెషన్ సాఫీగా సాగింది. 


Also Read: Old Currency Buyers: ఈ కరెన్సీ నోట్లు ఉంటే ఇంట్లో కూర్చొనే మీరు లక్షధికారి కావ్వొచ్చు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook