India vs Sri Lanka: రెండో వన్డే నుంచి చాహల్ ఔట్.. టాస్ గెలిచిన శ్రీలంక.. తుది జట్లు ఇవే..
IND Vs SL Playing 11: భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక తుది జట్టులో రెండు మార్పులు చేసింది.
IND Vs SL Playing 11: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శానక మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక రెండు మార్పులతో తుది జట్టును ప్రకటించింది. చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.
లంక కెప్టెన్ శానక మాట్లాడుతూ.. 'మేము మొదట బ్యాటింగ్ చేస్తామం. మొదట బ్యాటింగ్ చేసేందుకు మంచి పిచ్. భారీ స్కోర్ చేయడం చాలా ముఖ్యం. మా సహజమైన ఆట ఆడుతాం. మధుశంక, పాతుమ్ నిస్సాంక స్థానంలో నువానీడదు ఫెర్నాండో, లహిరు కుమార జట్టులోకి వచ్చారు. నిస్సాంక భూజం గాయం కారణంగా తప్పుకున్నాడు. నువానీదు ఫెర్నాండో ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు..' అని తెలిపాడు.
'నా మైండ్‌లో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. మేం లాస్ట్ మ్యాచ్ చూసి మొదట బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. కానీ ఈ మైదానాన్ని చూసి.. నేను ఫీల్డింగ్ చేయాలనుకున్నాను. అయితే టాస్ మన చేతుల్లో లేదు. మనం గతంలో ఏమి చేశామో అది గతం. ఇప్పుడు ఎలా ఆడతామన్నదే ముఖ్యం. నాకు ఇక్కడ ఆడటం చాలా ఇష్టం. ప్రేక్షకులు కూడా ఉత్సాహంగా ఉండటం నన్ను ప్రోత్సహిస్తుంది. కానీ ఇది గతంలో. నేను మళ్లీ తాజాగా ప్రారంభించాలి. గత మ్యాచ్‌లో గాయపడిన చాహల్ ఇంకా బాగా కోలుకులేదు. కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు..' అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, నువానీదు ఫెర్నాండో, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత
Also Read: Ind Vs SL: సిరీస్ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!
Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి