India vs West Indies 3rd ODI Highlights: నిర్ణయాత్మకమైన చివరి వన్డేలో విండీస్ ను టీమిండియా చిత్తు చిత్తుగా ఓడించింది. రోహిత్, కోహ్లీ లేకున్నా కుర్రాళ్లు అద్భుతంగా ఆడి భారత్ కు సిరీస్ ను అందించారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ ఓడి మెుదటి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. భారత  ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్‌ గిల్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఇషాన్‌ (77; 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫామ్‌ని కొనసాగిస్తూ వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. తొలి రెండు వన్డేల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయిన శుభ్‌మన్‌ గిల్ (85; 92 బంతుల్లో 11 ఫోర్లు) ఈ సారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్ లో విఫలమైన సంజు శాంసన్ (51; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్య (70*; 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా అర్థశతకాలతో మెరిశారు. 35 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదనిపించాడు. కరీబియన్ జట్టు బౌలర్లలో షెఫర్డ్ 2, కరియా, జోసెఫ్‌, మోటీ ఒక్కో వికెట్ పడగొట్టారు. 


352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను ముకేశ్‌కుమార్‌ దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీసి ఆతిథ్య జట్టును బెంబేలెత్తించాడు. తొలి మూడు వికెట్లు అతడి ఖాతాలోకే చేరాయి. బ్రెండన్ కింగ్ (0), కైల్ మేయర్స్‌ (4), షై హోప్(5)వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. మరోవైపు శార్ధూల్, కుల్‌దీప్‌ యాదవ్ చెలరేగడంతో కరీబియన్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఆటగాళ్లలో టెయిలెండర్‌ గుడాకేష్‌ మోటీ (39*) టాప్‌ స్కోరర్ గా నిలిచాడు. శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్‌ (3/30 ), కుల్‌దీప్‌ యాదవ్ (2/25) వికెట్లు తీశారు. ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. విండీస్‌పై టీమిండియా వరుసగా 13వసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.


Also Read: Jasprit Bumrah: బూమ్రా బ్యాక్, ఐర్లండ్ పర్యటనలో టీమ్ ఇండయా సారధ్య బాధ్యతలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook