Jasprit Bumrah: టీమ్ ఇండియాకు మరో సారధి వచ్చేశాడు. గాయం కారణంగా ఏడాది క్రికెట్ టోర్నీలకు దూరమైన టీమ్ ఇండియా మేటి పేసర్ జస్‌ప్రీత్ బూమ్రా జట్టులోకి తిరిగి వచ్చేశాడు. జట్టులోకి రాగానే ఐర్లండ్ పర్యటనకు జట్టు పగ్గాలను బీసీసీఐ బూమ్రాకు అప్పగించేసింది.
టీమ్ ఇండియాకు ఇది కచ్చితంగా శుభవార్త. భారత జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బూమ్రా ఏడాది తరువాత జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా గత ఏడాది జరిగిన ప్రతి టోర్నీకు దూరమయ్యాడు. ఇప్పుడు సరిగ్గా ఆసియా కప్, ప్రపంచకప్ ముందు టీమ్ ఇండియాకు అందుబాటులో వచ్చాడు. త్వరలో ఐర్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టుకు నేతృత్వం వహించబోతున్నాడు. బూమ్రా నేతృత్వంలో ప్లేయింగ్ 15 కూడా ప్రకటించింది బీసీసీఐ. టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా ఈ నెలలోనే ఐర్లండ్ పర్యటించనుంది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన బూమ్రాకు బీసీసీఐ ఏకంగా పగ్గాలు ఇచ్చేసింది. ఆసియా కప్ ముందు బూమ్రాకు ఇది ప్రిపరేటరీ మ్యాచ్ కాగలదు. ఇక వైస్ కెప్టెన్‌గా రుతురాత్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.
త్వరలో ఆసియా కప్, ప్రపంచకప్ ఉండటంతో సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. హార్టిక్ పాండ్యాకు సైతం విశ్రాంతి కల్పించారు. ఆసియా గేమ్స్‌కు ఏ జట్టు వెళ్లనుందో ఐర్లండ్ పర్యటనకూ అదే జట్టు ఉంటుంది. గాయం నుంచి కోలుకున్న యువ పేసర్ ప్రసిద్ధ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. భారత్ , ఐర్లండ్ దేశాలు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆగస్టు 18వ తేదీన తొలి టీ20 మ్యాచ్ కాగా, మిగిలిన రెండూ ఆగస్టు 20,23 తేదీల్లో జరుగుతాయి.
ఐర్లండ్ పర్యటనకు టీమ్ ఇండియా జట్టు ఇదే
జస్‌ప్రీత్ బూమ్రా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజూ శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముకేష్ కుమార్, అవేశ్ ఖాన్
Also read: Cricket Records: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాట్స్‌మెన్ వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook