IND vs WI 3rd T20: టీమిండియాదే బ్యాటింగ్.. ఆవేశ్ ఖాన్ అరంగేట్రం! నాలుగు మార్పులతో బరిలోకి భారత్!!
IND vs WI 3rd T20 Toss: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మరికొద్దిసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
West Indies have won the toss and have opted to field: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మరికొద్దిసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు పోలార్డ్ చెప్పాడు. టీమిండియాను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. షాయ్ హోప్, డొమినిక్ డ్రేక్స్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్ మ్యాచ్ ఆడుతున్నారు.
భారత జట్టులో నాలుగు మార్పులు చేశామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్‌లు ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. వారి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్ వచ్చారు. ఆవేశ్ ఖాన్ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఇషాన్ కిషన్‌తోకలిసి రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ చెప్పాడు.
కోల్‌కతా వేదికగా జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇదే జోరులో మూడో టీ20 మ్యాచ్‌లోనూ గెలుపొంది టీ20 సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు భారత పర్యటనలో పరాజయాల పరంపర కొనసాగిస్తున్న వెస్టిండీస్.. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి భారత పర్యటనను ఘనంగా ముగించాలనుకుంటోంది. ఇరు జట్లలో హిట్టర్లు ఉండడంతో భారీ స్కోర్ ఖాయంగా కనిపిస్తోంది.
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రోహిత్ శర్మ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్.
వెస్టిండీస్: షాయ్ హోప్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రొమన్ పావెల్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, డొమినిక్ డ్రేక్స్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్.
Also Read: Pawan Kalyan Rally: ర్యాలీలో అపశ్రుతి.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తప్పిన ప్రమాదం! Video
Also Read: Ranji Trophy Yash Dhull: యశ్ ధుల్ అరుదైన రికార్డు.. సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook